హాయ్ నాన్నా ప్రమోషన్స్.. నానీ, మృణాల్ ఫన్నీ ఇంటర్వ్యూ

హాయ్ నాన్నా ప్రమోషన్స్.. నానీ, మృణాల్ ఫన్నీ ఇంటర్వ్యూ
సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. దాంతో తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి.

సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. దాంతో తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు నానీతో హాయ్ నాన్న చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నా ప్రమోషన్స్ చేపట్టింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే నానీ, మృణాల్ ఠాకూర్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు.

ఇంటర్వ్యూలో భాగంగా నెటిజన్లు కూడా నానీ, మృణాల్ లకు కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటిని నానీ మృణాల్ ని అడగగా ఆమె వాటకి ఫన్నీగా సమాధానం చెప్పి ఆకట్టుకుంది.

ఎక్కడి నుంచి వచ్చావ్ అని అంటే.. ముంబైలోని తునే అనే ఊరు నుంచి అని చెప్పింది. తాను చేసిన మొదటి సినిమా మరాఠీ భాషలోనే అని చెప్పింది. స్టార్ కిడ్ వా అంటే.. నేను కాదు నా పిల్లలు స్టార్ కిడ్స్ అవుతారు అని ఫన్నీగా సమాధానం ఇచ్చింది. పెళ్లయిందా అంటే.. ఇంకా కాలేదు.. కానీ ఎప్పుడో ఒకసారి చేసుకోవాల్సిందే అని బదులిచ్చింది.నీ ఆస్తులు ఎన్ని అంటే మీరు లెక్క పెట్టలేరు అని తెలుగులో ముద్దుగా చెప్పి నవ్వేసింది.

యాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకున్నారు అని అంటే.. మామూలుగా అయితే డెంటిస్ట్ అవ్వాలనుకుని మెడిసిన్ లో జాయిన్ అయ్యాను కూడా అయితే చదువు పట్ల అంత ఇంట్రస్ట్ లేదు.. ఈ లోపు ఎక్కడో ఆడిషన్ జరుగుతుందని ఫ్రెండ్ చెబితే వెళ్లాను.. ఒకవేళ సెలెక్ట్ అయినా కానీ వాళ్లు వెంటనే ఆఫర్ ఏమీ ఇవ్వరు.. ఓ నాలుగేళ్లు అయితే కచ్చితంగా పడుతుంది.. ఆ సమయానికి నీ చదువు కూడా పూర్తయి పోతుంది అని చెప్పి పంపించింది. ఆడిషన్ కి వెళ్లాను.. వెంటనే కాల్ వచ్చింది.. ఓ సినిమాలో సెలెక్ట్ చేశామని చెప్పారు. దాంతో చదువు అటకెక్కింది. డాక్టర్ కాబోయి ఆ విధంగా యాక్టర్ అయ్యాను అని వివరించింది.

తెలుగు బాగా మాట్లాడుతున్నారు.. ఎక్కడ నేర్చుకుంటున్నారు అని అంటే షూటింగ్ గ్యాప్ లో ప్రాక్టీస్ చేస్తుంటానని చెప్పింది. రాసుకుని మాట్లాడతాను.. అని తెలుగులో ఎక్కువగా మాట్లాడే పదాలను చెప్పింది. ఇక మృణాల్ ని వయసు గురించి అడగగా మొన్నే నాకు పదహారు వచ్చాయి అని నవ్వించింది. నేను అస్సలు నమ్మను అని నాని అంటే మళ్లీ 21 అని చెబుతుంది. అప్పుడు కూడా నమ్మేట్టు లేదు నిజం చెప్పు అని అనగానే 31 అని, తాను 1992లో పుట్టాను అని నానీ డౌట్ ని క్లియర్ చేస్తుంది. అలా ఈ ఇద్దరి మధ్య సాగిన ఫన్నీ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story