సినిమా

Hamsa Nandini: హంసానందిని అసలు పేరేంటో తెలుసా.. ఆమెకి ఈ పేరు ఎవరు పెట్టారు..

Hamsa Nandini: ఓ హీరోయిన్‌కి ఏమాత్రం తగ్గని అందం.. అభినయం.. అయినా ఎందుకో హీరోయిన్‌గా రాణించలేకపోయింది.

Hamsa Nandini: హంసానందిని అసలు పేరేంటో తెలుసా.. ఆమెకి ఈ పేరు ఎవరు పెట్టారు..
X

Hamsa Nandini: ఓ హీరోయిన్‌కి ఏమాత్రం తగ్గని అందం.. అభినయం.. అయినా ఎందుకో హీరోయిన్‌గా రాణించలేకపోయింది. ఐటెం సాంగ్స్‌కే పరిమితం అయింది. మోడల్‌గా, డ్యాన్సర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన హంస హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011 మరియు 2013 కోసం మోడల్‌గా పనిచేసింది.

సినిమాల్లోకి రాకముందు హంస అసలు పేరు పూనమ్.. మొదట అదే పేరుతో కొన్ని చిత్రాల్లో కనిపించింది. అయితే చిత్ర పరిశ్రమలో చాలా మందికి పూనమ్ పేరు ఉందని, పేరు మార్చుకోమని సూచించారు దర్శకుడు వంశీ. ఆయనే హంసా నందిని అనే పేరు కూడా సజెస్ట్ చేశారు. ఆపేరు నచ్చడంతో అదే అసలు పేరుగా మారిపోయింది. స్టార్ హీరోలు నటించిన తెలుగు చిత్రాల్లోని ఐటెం సాంగ్స్‌లో హంసానందిని మెరిసింది.

పూణెలో పుట్టి పెరిగిన హంస మోడల్ కావాలన్న తలంపుతో ముంబై ట్రైన్ ఎక్కింది. 2002 నుండి మోడలింగ్ పరిశ్రమలో రాణించింది. వివిధ టెలివిజన్ వాణిజ్య ప్రకటనలకు మోడలింగ్ చేసింది. హ్యూమన్ రిసోర్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హంస మోడలింగ్‌లో రాణిస్తూనే సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది.

2013లో విడుదలైన మిర్చి, భాయ్, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా చిత్రాలో ఐటెం సాంగ్స్‌కి డ్యాన్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలకృష్ణ నటించిన లెజెండ్‌లో కూడా ఆమె ఐటెం సాంగ్ పాపులరైంది. గోపీచంద్, రాజ్ తరుణ్, నాగార్జున తదితరుల చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసి మెప్పించింది. ఇప్పుడిలా హంసా నందిని క్యాన్సర్ బారిన పడడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Next Story

RELATED STORIES