HIT 2 Teaser: హిట్ 2 టీజర్.. ఏముంది అందులో.. ఎందుకు తొలగించింది యూట్యూబ్

HIT 2 Teaser: హిట్ 2 టీజర్.. ఏముంది అందులో.. ఎందుకు తొలగించింది యూట్యూబ్
HIT 2 Teaser: అడివి శేష్ హీరోగా... మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హిట్-2'. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్... ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

HIT 2 Teaser: అడివి శేష్ హీరోగా... మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హిట్-2'. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్... ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ట్రేండింగ్ లో ఉన్న ఈ టీజర్ ని యూట్యూబ్ సడన్ గా తొలిగించడంతో అందరూ షాక్ కు గురైయ్యారు. బట్ మూవీ టీమ్ మాత్రం ఇది ముందే ఊహించామని చాలా మామూలుగా రియాక్ట్ అయ్యారు. అసలింతకీ హిట్ 2 మూవీ టీజర్ ను ఎందుకు తొలగించారు..? దీనికి హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు.. ?


ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఈ మూవీ పై అంచనాలను మరింత పెంచింది. టీజర్ ఎంతో సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. ఇక చివరిలో వచ్చే సీన్ మాత్రం అందర్నీ భయానికి గురిచేసింది.


రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది హిట్2 టీజర్. దీంతో మూవీ టీమ్ రికార్డుల లెక్కలు వేసుకుంటోన్న టైమ్ లో సడెన్ గా యూ ట్యూబ్ నుంచి తొలగించారు. దీని గురించి అడివి శేష్ స్పందిస్తూ... సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశాడు.


టీజర్ లో హింసాత్మక సన్నివేశాలు ఉండడంతో.. యూట్యూబ్ హిట్-2 టీజర్ ని ట్రేండింగ్ లిస్ట్ ని నుంచి తొలిగించిందని తెలిపాడు. అంతేకాకుండా 18 ఏళ్ళ వయసు కంటే తక్కువ వయసు ఉన్న వారు చూడకూడదని ఆ నిర్ణయం తీసుకుంది.. ఈ టీజర్ చూడాలంటే యూట్యూబ్ లో సైన్ ఇన్ అయ్యి చూడాల్సిందే... అంటూ తెలిపాడు. ఇక ఈ విషయం ముందే ఊహించామని.. ఇక హిట్-2 మూవీలో వైలెన్స్ మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఉంటుందని చెప్పాడు శేష్.

Tags

Read MoreRead Less
Next Story