Naga Chaitanya: మా గురించి మాట్లాడుకోవడం మానేస్తారని ఆశిస్తున్నా: నాగ చైతన్య

Naga Chaitanya: మా గురించి మాట్లాడుకోవడం మానేస్తారని ఆశిస్తున్నా: నాగ చైతన్య
Naga Chaitanya: సమంత, నాగచైతన్య కచ్చితంగా టాపిక్‌లో ఉండే వ్యక్తులు.. వాళ్ల గురించి ఏ చిన్న వార్త వచ్చినా అభిమానులు ఆసక్తిగా వింటారు, చదువుతారు..

Naga Chaitanya: సమంత, నాగచైతన్య కచ్చితంగా టాపిక్‌లో ఉండే వ్యక్తులు.. వాళ్ల గురించి ఏ చిన్న వార్త వచ్చినా అభిమానులు ఆసక్తిగా వింటారు, చదువుతారు.. సినిమా రిలీజ్ ఫంక్షన్‌కో, మరొకటో వేదిక ఏదైనా వాళ్లిద్దరి డైవోర్స్ ప్రస్తావన కచ్ఛితంగా ఉంటుంది. మరి వాళ్లిద్దరు విడిపోవడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.. అదే అవే ప్రశ్నలు రిపీటెడ్‌గా.. సహనానికి కూడా ఓ హద్దుంటుంది.. నాగచైతన్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి నా వర్క్ గురించి మాట్లాడుకోండి అని రిక్వెస్ట్ చేశాడు. మేమిద్దం విడిపోయి మా జీవితాలను కొనసాగిస్తున్నాము..

మా గురించి మాట్లాడుకోవటానికి ఇంకేమీ లేదని, త్వరలో ఇలాంటి వార్తలన్నింటికి చెక్ పెడతారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. అక్టోబర్ 2021 లో, సమంత మరియు నాగ చైతన్య తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.

"మేమిద్దరం ఏం చెప్పాలనుకున్నామో దానిని ఒక ప్రకటన ద్వారా అభిమానులకు తెలియజేశాము. ఏది ఏమైనప్పటికీ నా వ్యక్తిగత జీవితంలో నేను ఎప్పుడూ చేసేది అదే. నేను పంచుకోవడం లేదా బయట పెట్టడం చాలా కీలకమని భావిస్తాను. అది మంచిదైనా, చెడ్డదైనా.. మా విషయంలో సమంత కదిలింది, నేను ముందుకు వెళ్లాను. ఇంతకంటే మరేం లేదు అని చైతన్య చెప్పాడు.

తన వ్యక్తిగత జీవితం చుట్టూ అల్లుకున్న కథలు త్వరలో మసకబారుతాయని ఆశిస్తున్నాడు. "నా స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ముఖ్యమైన వ్యక్తులకు మా ఫ్యామిలీ లైఫ్ గురించి తెలుసు. ఒక వార్త వచ్చి మరొక వార్తను భర్తీ చేస్తుంది. ఊహాగానాలు చాలా తాత్కాలికమైనవి. నేను దానికి ఎంత ఎక్కువ ప్రతిస్పంది అది మరొక వార్త అవుతుంది. కాబట్టి నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. జరిగేది జరగనివ్వండి అని అన్నారాయన.

సమంత మరియు నాగ చైతన్యల ప్రేమకథ

2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఏ మాయ చేసావే చిత్రం ద్వారా సమంత, నాగ చైతన్య మొదటిసారి కలుసుకున్నారు. దాదాపు 7సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత, ఇద్దరూ 2017లో గోవాలో వివాహం చేసుకున్నారు. రాజీలేని విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. రూ.250 కోట్ల భరణం ఇవ్వాలని సమంత డిమాండ్ చేసిందని ప్రచారం జరిగింది. అయితే దానికి నవ్వుతూ కాఫీ విత్ కరణ్ 7లో పాల్గొన్న సమంత ఇది అత్యంత క్రేజీ రూమర్ అని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story