అవును .. నా ఆస్థి వెయ్యి కోట్లకంటే ఎక్కువే..: నరేష్

అవును .. నా ఆస్థి వెయ్యి కోట్లకంటే ఎక్కువే..: నరేష్
ప్రముఖ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్‌తో ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే.

ప్రముఖ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్‌తో ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఎమ్.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నరేష్, పవిత్ర ఇద్దరూ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఈ జంట వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు వారి వ్యక్తిగత జీవిత వివరాలను కూడా పంచుకున్నారు. కొన్ని రోజులుగా నరేష్ ఆస్తుల గురించి చాలా మంది మాట్లాడుతున్నారని, అందుకే పవిత్ర.. నరేష్ తో సంబంధం పెట్టుకుందని వినిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలో నరేష్ తన ఆస్తి వివరాలను కూడా వెల్లడించాడు.

నేను నిజానికి బిలియనీర్ ను. నాకు నా తల్లి నుండి కూడా ఆస్థి సంక్రమించింది. ఇంకా సినిమాలు చేసి కష్టపడి డబ్బు సంపాదించాను. నా ఆస్తి విలువ 1000 కోట్లకు పైగా ఉంటుంది. ఇదంతా బ్లాక్ మనీ కాదు.. అంతా వైటే.. ఆస్థికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తానని చెప్పుకొచ్చాడు.

దేవుడు మనకు జీవితాన్ని ప్రసాదించాడు. మనం సంతోషంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న పది మందిని సంతోషంగా ఉంచాలి. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మనకు ప్రతిరోజు సెల్యూట్ కొట్టాలి అని కాదు. మనల్ని మనం చూసుకుంటే మనకి ఆనందం కలగాలి. అదే నేను చేసాను. పవిత్ర తన తల్లి నుండి అదే నిజాయితీని సంపాదించింది. మేము మా కోసం కొంచెం ఖర్చు పెడతాము. మిగిలిన దానితో ఇతరుల కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాము. మేం ఆపని ఇప్పటికే చేస్తున్నాం. అలా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నారు నరేష్.

తన ఆస్తుల గురించి నరేష్‌ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్లు అతని మాటలను నమ్మడం లేదు. కొందరు అంతా అబద్ధం అని కొట్టి పారేస్తే.. మరికొందరు అతని మాటలు నిజమని, అతను నిజమైన బిలియనీర్ అని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story