సినిమా

Samantha: నాకు నేను పర్‌ఫెక్ట్.. నేను ప్రేమిస్తున్నాను..!

Samantha: జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు.. అలా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది..

Samantha: నాకు నేను పర్‌ఫెక్ట్.. నేను ప్రేమిస్తున్నాను..!
X

Samantha: జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు.. అలా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది.. తప్పు ఎవరిదైనా కావచ్చు. కానీ లోకం ఒకరినే తప్పు పడుతుంది.. ఆ ట్రాన్స్ నుంచి కోలుకుంటూ తనని తాను స్ట్రాంగ్ గా ఉంచుకునేందుకు సిద్ధపడుతోంది సమంత.

ఎన్ని కష్టాలు ఎదురైనా కృంగి పోకుండా జీవితంలో మళ్లీ నిలబడేందుకు సమాయత్తమవుతున్నా.. ఆ సత్తా నాలో ఉంది. నేను బలవంతురాలిని అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటోంది. నేను కొందరికి ఫర్ ఫెక్ట్ కాకపోవచ్చు. కానీ నాకు నేను ఫర్ ఫెక్ట్. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను.

ఆ విషయంలో నేను విజయం సాధిస్తాను. నేను మనిషిని. నాకు పోరాడగలిగే సత్తా ఉందని మా అమ్మ చెప్పింది అంటూ సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి రోజు ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెడుతూ తన మనసులోని భావాలను వ్యక్త పరుస్తోంది.. ఆమె పోస్టుల్లో ఏదో తెలియని బాధ కనపడుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.





Next Story

RELATED STORIES