చిరంజీవి జీవిత కథను పిల్లలకు పాఠాలుగా: బండ్లన్న కోరిక

చిరంజీవి జీవిత కథను పిల్లలకు పాఠాలుగా: బండ్లన్న కోరిక
మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి మళ్లీ ఒకసారి వార్తల్లో నిలిచారు.

బండ్ల గణేష్ ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో ఒకరు. తన మాటల ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేయడంలో బండ్ల గణేష్ ఎప్పుడూ ముందుంటారు. వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన వైరల్ ప్రసంగం తరువాత, గణేష్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి మళ్లీ ఒకసారి వార్తల్లో నిలిచారు.

ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, సుప్రీం స్టార్ గురించి మాట్లాడటానికి అభిమానులు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్‌ను నిర్వహించారు. యాంకర్ సుమ ఈ స్పేస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డైరెక్టర్ బాబీ, కోన వెంకట్, నవీన్ పోలిశెట్టితో పాటు మరికొందరు దర్శకులు, నటీనటులు, నిర్మాతలతో సహా పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు సెషన్‌లో పాల్గొన్నారు. బండ్ల గణేష్ కూడా తనదైన స్టైల్‌లో స్పందించారు.

చిరంజీవి గురించి మాట్లాడుతున్నప్పుడు, బండ్ల తనదైన శైలిలో మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపించారు. చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు. అంతటితో ఆగక ఓ ప్రత్యేకమైన కోరికను వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అంటే తెలుగువారికి ఒక పండుగ అని అన్నారు. సాదారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు అని బండ్ల అన్నారు. "మెగాస్టార్ చిరంజీవి జీవిత కథను పాఠశాల పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో పాఠంగా చేర్చాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను" అని బండ్ల గణేష్ ట్విట్టర్‌ ఇంటరాక్షన్ సెషన్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే బండ్ల గణేష్ త్వరలో పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story