యోగి పాదాలు తాకిన రజినీ: ట్రోల్స్ కు క్లారిటీ

యోగి పాదాలు తాకిన రజినీ: ట్రోల్స్ కు క్లారిటీ
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల విడుదలైన యాక్షన్ డ్రామా, జైలర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొట్టింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల విడుదలైన యాక్షన్ డ్రామా, జైలర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొట్టింది. రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. జైలర్ భారీ విజయం సాధించిన ఆనందంతో, రజనీ హిమాలయాలతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లారు.

ఉత్తర భారత పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసంలో రజనీ ఆయనతో సమావేశమై సీఎం పాదాలకు నమస్కారించారు. రజినీ యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకిన వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీ తన కంటే చాలా చిన్న వ్యక్తి పాదాలను తాకడం నెటిజన్లకు రుచించలేదు. దాంతో రజినీనీ భారీగా ట్రోల్ చేశారు. దాంతో రజనీకి తాను చేసిన చర్యకు క్లారిటీ ఇచ్చుకోక తప్పింది కాదు.

చెన్నై విమానాశ్రయంలో తమిళ మీడియాతో రజినీ మాట్లాడుతూ.. యోగి అయినా, స్వామి అయినా వయసుతో నిమిత్తం లేకుండా ఎవరి పాదాలనైనా తాకడంలో తప్పులేదన్నది తన సూత్రమని అన్నారు. జైలర్‌కు భారీ విజయాన్ని అందించినందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, సినీ ప్రేమికులకు రజనీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story