NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జోడీ కట్టనున్న జాన్వీ..

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జోడీ కట్టనున్న జాన్వీ..
NTR: తాతతో అమ్మ.. మనవడితో కూతురు.. అందాల తార శ్రీదేవి.. దివి నుండి తన కూతురు జాన్వీని ఆశీర్వదించి ఉంటుంది..

NTR: తాతతో అమ్మ.. మనవడితో కూతురు.. అందాల తార శ్రీదేవి.. దివి నుండి తన కూతురు జాన్వీని ఆశీర్వదించి ఉంటుంది.. ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ సక్సెస్ అవ్వాలని. తెలుగు తెరపై కనిపించాలని ఉబలాటపడుతున్న జాన్వీ కపూర్‌కి ఎట్టకేలకు ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు జాన్వీ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్నారని సమాచారం. ఎన్టీఆర్ సూచించిన స్వల్ప మార్పులతో చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ రెండో సినిమాపై అభిమానులకు భారీ అంచానాలు ఉన్నాయి. ఇక జాన్వీకపూర్.. ఎన్టీఆర్‌తో జోడీ కట్టనుందనే విషయంగా కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంతవరకు ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదు.

Tags

Read MoreRead Less
Next Story