సినిమా

ఆస్పత్రిలో చేరిన బిగ్‌బాస్ బ్యూటీ.. నువ్వు కూడా త్వరగా చచ్చిపో అంటూ..

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కుటుంబసభ్యలతో పాటు అభిమానులకు తీరని దుఖాన్ని మిగిల్చింది.

ఆస్పత్రిలో చేరిన బిగ్‌బాస్ బ్యూటీ.. నువ్వు కూడా త్వరగా చచ్చిపో అంటూ..
X

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కుటుంబసభ్యలతో పాటు అభిమానులకు తీరని దుఖాన్ని మిగిల్చింది. తీవ్రమైన గుండెనొప్పితో 40 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం అభిమానులను షాక్‌కి గురిచేసింది. తాజాగా ముజ్‌సే షాదీ కరోగి రియాలిటీ షోలో సిద్ధార్థ్ శుక్లాతో కలిసి పని చేసిన బిగ్‌బాస్ 12 పార్టిసిపెంట్ జస్లీన్ మాతరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.

తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చేరినట్లు స్వయంగా ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోను చూసిన నెటిజన్ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యాడు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిద్ధార్ధ్ మరణించాడని తెలిసి షాక్‌లోకి వెళ్లాను.. వెంటనే తేరుకుని అతడి ఇంటికి వెళ్లాను.. అక్కడ షెహనాజ్‌ని , సిద్దార్థ్ మదర్‌ని కలిసి వచ్చాను. అనంతరం ఇంటికి వచ్చాక సిద్ధార్థ్ మృతికి సంతాపం తెలుపుతూ ఓ మెసేజ్‌ పెట్టాను. ఈ లోపే ఓ వ్యక్తి రాసిన మెసేజ్ చూసి చాలా భయపడిపోయాను.. నువ్వు కూడా త్వరగా చచ్చిపో అని అతడు మెసేజ్ చేశాడు.

అది చూసి భయంతో వణికిపోయాను. ఒళ్లు కాలిపోతోంది.. జ్వరం చూసుకుంటే 103 డిగ్రీలు ఉంది.. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాను అని పేర్కొంది. నెటిజన్ కామెంట్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఒకరి మరణం గురించి జోక్స్ ఎలా వేస్తారు.. అలా అనడానికి సిగ్గు లేదా.. అందరూ చచ్చిపోయాక ఒక్కరే ఉంటారా.. ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడతారు అని జస్లిన్ ఘాటుగా బదులిచ్చింది.

Next Story

RELATED STORIES