సినిమా

Jr. NTR: 35 ఏళ్లుగా మా రెండు కుటుంబాల మధ్య వార్.. అయినా..

Jr. NTR: తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ మూవీస్ గురించి ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Jr. NTR: 35 ఏళ్లుగా మా రెండు కుటుంబాల మధ్య వార్.. అయినా..
X

Jr. NTR: ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే.. నటనలోనూ, డ్యాన్సులోనూ ఒకరిని మించి ఒకరు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఉంటారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్‌లో ఆ ఇద్దరు హీరోలు అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీంగా ప్రేక్షకులను అలరించనున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఊరిస్తూ వచ్చిన ఆ చిత్రం జనవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపధ్యంలో రామ్ చరణ్, తారక్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు లాంటి నగరాల్లో ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ మూవీస్ గురించి ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయం గురించి ఇప్పుడు చెప్పొచ్చో లేదో కానీ మా రెండు కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తోంది. అయినా మేమిద్దరం (రామ్ చరణ్, తారక్) మంచి స్నేహితులం. మా మధ్య వార్ ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత దేశంలోని టాప్ స్టార్స్ సైతం ఒకే తాటిపైకి వస్తారని ఆశిస్తున్నా. మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు భారీ స్థాయిలో వస్తాయనే నమ్మకం నాకుంది అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడిన తీరుకి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.

Next Story

RELATED STORIES