సినిమా

Jr. NTR Deepavali Special: ఎన్టీఆర్ దీపావళి స్పెషల్.. ఆనందంలో అభిమానులు..

Jr. NTR Deepavali Special: సెలబ్రెటీ అయినా, స్టార్ స్టేటస్ ఉన్నా సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయర్స్ ఉన్నా

Jr. NTR Deepavali Special: ఎన్టీఆర్ దీపావళి స్పెషల్.. ఆనందంలో అభిమానులు..
X

Jr. NTR Deepavali Special: సెలబ్రెటీ అయినా, స్టార్ స్టేటస్ ఉన్నా సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయర్స్ ఉన్నా ఎప్పుడో కానీ ఫోటోలు షేర్ చేస్తారు ఎన్టీఆర్.. తాజాగా దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించకుని తన ఇద్దరు చిన్నారులు అభయ్ రామ్, భరత్ రామ్‌లతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు తారక్. తండ్రీ కొడుకులు ఒకే కలర్ డ్రస్ వేసుకుని కనిపించారు. ముద్దుగా ఉన్న ఇద్దరు చిన్నారులను చూసి అభిమానులు ముచ్చట పడుతున్నారు.

కాగా, రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు అని ప్రతి రోజు బుల్లి తెర ప్రేక్షకులను పలకరిస్తున్న తారక్ మరింత మందికి చేరువయ్యారు. ఆట నాది, కోటి మీది అంటూ బుల్లితెర ప్రేక్షకులను తన మాటల ద్వారా మెస్మరైజ్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేశారు తారక్. దాని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా.. సో.. సినిమాలు, యాడ్లు, బుల్లి తెర షోలు.. ఎంత బిజీలో ఉన్నా వేటి ప్రయారిటీ వాటికే ఇస్తూ సరదా సమయాన్ని కుటుంబంతో గడుపుతుంటారు. ఖాళీ దొరికితే తన ఇద్దరు చిన్నారులతో కాలక్షేపం చేస్తుంటారు ఎన్టీఆర్.

Next Story

RELATED STORIES