సినిమా

kaikala satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యన్నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం

kaikala satyanarayana: కొద్దిరోజుల క్రితం తన ఇంట్లో జారిపడటంతో గాయాలయ్యాయి..

kaikala satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యన్నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం
X

Kaikala Satyanarayana: విలక్షణ నటుడు, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.. ప్రస్తుతం ఆయనకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.. వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు..

ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.. కొద్దిరోజుల క్రితం తన ఇంట్లో జారిపడటంతో గాయాలయ్యాయి.. నొప్పులు ఎక్కువ కావడంతో మొదట సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.. అక్కడ కొద్దిరోజులు చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా, యముడిగా, కమెడియన్‌గా ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేసి ఒదిగిపోవడం కైకాల సత్యనారాయణకే చెందుతుంది.. ఒకటి కాదు రెండు కాదు.. ఆరు దశాబ్దాల పాటు ఆయన ప్రేక్షకుల్ని అల‌రించారు.. కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.. ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

Next Story

RELATED STORIES