Kajal Agarwal: ప్రెగ్నెన్సీ అనుభవాలను షేర్ చేసిన కాజల్..

Kajal Agarwal: ప్రెగ్నెన్సీ అనుభవాలను షేర్ చేసిన కాజల్..
Kajal Agarwal: మన జీవిత భాగస్వామిని ప్రేమిస్తున్నప్పుడు, ఈ భావోద్వేగ బంధంలో మనల్ని మనం మరచిపోతాము

Kajal Agarwal: అందమైన చందమామ కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.. ఆ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తూ అభిమానుల కోసం అప్పుడప్పుడూ ఫోటోషూట్ లను చేస్తోంది.

2020 అక్టోబర్‌లో కాజల్ తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్చులను పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న కాజల్, పెళ్లయినప్పటికీ సినిమాలను వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆమె గర్భం దాల్చడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంది. అందులో నాగార్జున, ప్రవీణ్ సత్తారు జంటగా నటించిన 'బేతాళుడు' సినిమా ఒకటి.

మిగతా హీరోయిన్ల కంటే కాజల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పాలి. 15 ఏళ్లుగా తన ఇమేజ్‌ని మెయింటైన్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్ కాజల్. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇదిలా ఉంటే, కాజల్ ఇటీవల తన ప్రెగ్నెన్సీ అనుభవాలను పంచుకుంది. 'తల్లి కావడం చాలా అందంగా, సంతోషంగా ఉంది కానీ.. అదే సమయంలో మనసంతా గందరగోళంగా ఉంటుంది.

ఒక్కో క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ కూడా ఉంది. ఏ సమయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో కాలమే నిర్ణయిస్తుంది. "మనం మన పిల్లలను, మన జీవిత భాగస్వామిని ప్రేమిస్తున్నప్పుడు, ఈ భావోద్వేగ బంధంలో మనల్ని మనం మరచిపోతాము" అని కాజల్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది.

కాజల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 21 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలను షేర్ చేసుకోవడం వల్ల ఆమె మరింత మందికి దగ్గరవుతోంది. పెళ్లి చేసుకుని గర్భం దాల్చిన హీరోయిన్లకు ఇక సినిమా అవకాశాలు రావని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాబట్టి వారికి సంపాదన కూడా ఉండదు.

కానీ కాజల్ తన ఇన్‌స్టా ద్వారా ప్రెగ్నెన్సీ ప్రొడక్ట్స్ వంటి వాటిని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉంది. ఓ వ్యాపకానికి తోడు సంపాదన కూడా ఉంటుంది. ఆమె తన బేబీ బంప్ ఫోటోలను కూడా ఎక్కువగా షేర్ చేస్తుంది. అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story