సినిమా

Alexandra Djavi: కాంచన 3 నటి అనుమానాస్పద మృతి..

చెన్నైకి చెందిన ఫోటోగ్రాఫర్‌పై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Alexandra Djavi: కాంచన 3 నటి అనుమానాస్పద మృతి..
X

Alexandra Djavi: రాఘవ లారెన్స్ దర్శకత్వం వచ్చిన కాంచన 3 చిత్రంలో నటించిన రష్యన్ మోడల్, నటి అలెగ్జాండ్రా జావి శుక్రవారం (ఆగస్టు 20) గోవాలోని ఓ హోటల్‌లో శవమై కనిపించింది. ఆమె వయసు 24. తాజా నివేదిక ప్రకారం, ప్రాథమిక పోలీసు విచారణలో నటి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చునని తేలింది. అయితే, పోలీసులు ప్రస్తుతం పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. గోవాలో ఆమె బస చేసిన హోటల్‌లోనే మృతి చెందడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌కి తనకి జరిగిన మనస్పర్థల కారణంగా జావి డిప్రెషన్‌లో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పోలీసులు అతడిని కూడా విచారించే అవకాశం ఉంది. 2019 లో కూడా, చెన్నైకి చెందిన ఫోటోగ్రాఫర్‌పై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిని లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. నివేదిక ప్రకారం, అతడిని కూడా ఇప్పుడు విచారించే అవకాశం ఉంది.

కాంచన 3 లో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆ చిత్రంలో అలెగ్జాండ్రా జావి ప్రతీకారం తీర్చుకునే దెయ్యం పాత్రను పోషించింది. బిగ్ బాస్ తమిళ్ కంటెస్టెంట్ ఒవియా, మరో కంటెస్టెంట్ నిక్కీ తంబోలి ఈ సినిమాలో ఇతర హీరోయిన్లుగా నటించారు.

Next Story

RELATED STORIES