Kangana Ranaut: ఖాన్, కుమార్ ల చిత్రాలు తిరస్కరించినందుకు అందరూ నన్ను.. : కంగన

Kangana Ranaut: ఖాన్, కుమార్ ల చిత్రాలు తిరస్కరించినందుకు అందరూ నన్ను.. : కంగన
Kangana Ranaut: ధాకడ్ ట్రైలర్ లాంచ్‌లో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. "నన్ను నేను తక్కువ మనిషిగా ఎందుకు భావించాలి" అని అన్నారు.

Kangana Ranaut: కంగనా రనౌత్ హీరోయిన్ కు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటిస్తుంది. అందుకు సంబంధించిన మంచి పాత్రలు తనను వెతుక్కుంటూ వస్తాయి. తన రాబోయే యాక్షన్ ధాకడ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా, కంగనా మాట్లాడుతూ, హీరోలను ఎలివేట్ చేసే చిత్రాలను తిరస్కరించడం, అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉండటం వంటి కొన్ని పెద్ద రిస్క్‌లు తీసుకోవడం ద్వారా తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పింది.

"నేను చాలా మేల్-సెంట్రిక్ చిత్రాలను తిరస్కరించినప్పుడు నన్ను చాలా మంది తప్పుపట్టారు. ఖాన్ లీడ్ ఫిల్మ్ లేదా కుమార్ లీడ్ ఫిల్మ్ లేదా అన్ని రకాల పెద్ద హీరోల సినిమాలు రిజెక్ట్ చేశాను. అందరూ నన్ను 'ఎందుకు' అలా చేస్తున్నావు.. జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అని అనేవారు. కానీ మన భవిష్యత్తు మీద మనకు నమ్మకం ఇలాంటి మాటలను లక్ష్యపెట్టాల్సిన అవసరం లేదు.

నేను ఇప్పటివరకు నా స్వయం శక్తితోనే ఇక్కడకు వచ్చాను. నన్ను నేను ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోను. నేను దేన్నీ ప్లాన్ చేసుకోను, కానీ నాకో విజన్ ఉంది అని చెప్పింది కంగన.

కంగనా రనౌత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ధాకడ్ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం వినోదాత్మక యాక్షన్‌గా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story