Kangana Ranaut: రూ. 600 కోట్లను బూడిద చేశారు.. 'బ్రహ్మాస్త్ర' పై కంగన కామెంట్స్

Kangana Ranaut: రూ. 600 కోట్లను బూడిద చేశారు.. బ్రహ్మాస్త్ర పై కంగన కామెంట్స్
Kangana Ranaut: ఎవ్వరినైనా ఏకి పారేయడంలో ముందుంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. తాజాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్రపై కంగనా విరుచుకుపడింది.

Kangana Ranaut: ఎవ్వరినైనా ఏకి పారేయడంలో ముందుంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. తాజాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్రపై కంగనా విరుచుకుపడింది. ఈ చిత్రాన్ని రూపొందించడానికి 12 సంవత్సరాలు పట్టింది.. 400 రోజులు చిత్రీకరించారు.. 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను, 14 మంది సినిమాటోగ్రాఫర్లను మార్చారు. రూ. 600 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అయినా ఎందుకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీని మెచ్చుకుంటున్నారు అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అయాన్ మతపరమైన మనోభావాలను ఉపయోగించుకుంటున్నాడని నటి ఆరోపించింది.

రణబీర్ కపూర్ , అలియా భట్ , అమితాబ్ బచ్చన్ , నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం సెప్టెంబర్ 9న విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది. దర్శకుడు అయాన్ ముఖర్జీని "మేధావి" అని పిలిచే వారిని "వెంటనే జైలులో పెట్టాలి" అని అన్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కంగనా బ్రహ్మాస్త్రాన్ని "విపత్తు" అని పేర్కొంది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కంగనా నిర్మాత కరణ్ జోహార్‌ను కూడా తిట్టింది. KJo తన సినిమా స్క్రిప్ట్‌ల కంటే "ప్రతి ఒక్కరి లైంగిక జీవితం"పై ఎక్కువ ఆసక్తి కనబరుస్తాడని విమర్శించింది. కరణ్ తన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని ప్రమోట్ చేయమని దక్షిణాది నటులను, దర్శకులను వేడుకున్నట్లు కంగనా తన పోస్ట్‌లో పేర్కొంది.

బ్రహ్మాస్త్రలో సౌత్ స్టార్ నాగార్జున కూడా నటించడంతో ఇటీవల ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. "అతను స్వయంగా రివ్యూలు, స్టార్లు మరియు నకిలీ కలెక్షన్ నంబర్లు, టిక్కెట్లను కొనుగోలు చేస్తాడు... కరణ్ జోహార్ "అన్నీ చేస్తాడు కానీ సమర్థులైన రచయితలు, దర్శకులు, నటులను తీసుకోరు" అని కంగన.. కరణ్ జోహార్ మీద ఉన్న కోపాన్నంతా వెళ్లగక్కింది.

Tags

Read MoreRead Less
Next Story