Kangana Ranaut: కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన మొదటి భారతీయురాలు.. కంగన కొన్న కారు ఖరీదు..

Kangana Ranaut: కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన మొదటి భారతీయురాలు.. కంగన కొన్న కారు ఖరీదు..
Kangana Ranaut:కంగనా నలుపు రంగు మెర్సిడెస్ మేబ్యాక్ S680 కారును కొనుగోలు చేసింది.

Kangana Ranaut: ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నలుపు రంగు మెర్సిడెస్ మేబ్యాక్ S680 కారును కొనుగోలు చేసింది. 5 కోట్ల రూపాయల విలువైన ఈ కారును కొనుగోలు చేసిన మొదటి భారతీయురాలు ఆమే కావడం విశేషం.

కంగనా రనౌత్, ఈ రోజు (మే 20) తాను నటించిన సినిమా ధాకడ్ ప్రీమియర్ షో చూడ్డానికి వచ్చింది. తాను రూ.5 కోట్లు పెట్టి కొన్న విలాసవంతమైన కారును కూడా ఈ రోజే షో రూమ్ నుంచి తీసుకువచ్చింది.

ముంబైలో తన తాజా చిత్రం ప్రదర్శనకు ముందు, కంగనా తన కొత్త కారును, తన తల్లిదండ్రులు, సోదరి రంగోలీతో సహా తన కుటుంబ సభ్యుల సమక్షంలో తన ఇంటి ముందు ఆవిష్కరించింది. కంగనా నలుపు రంగు మెర్సిడెస్ మేబ్యాక్ S680 కారును కొనుగోలు చేసింది.

కంగనా ఇటీవల తన పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యిందో వివరించింది. "మణికర్ణిక షూటింగ్ సమయంలో గాయపడినందున ధాకడ్ సినిమా కోసం నకిలీ తుపాకులను ఉపయోగించాలనుకున్నాను. కానీ దర్శకుడు నేను నిజమైన ఆయుధాలను ఉపయోగించాలని కోరుకున్నాడు. నా శిక్షణకు సంబంధించినంతవరకు , నేను చిన్నప్పటి నుండి నేర్చుకున్న మాస్టర్ సూర్య నారాయణ్ జీ వద్దే శిక్షణ పొందాను. కానీ మణికర్ణిక వంటి కొద్ది పాత్రలు తప్ప ఎప్పుడూ అలాంటి పాత్రలు చేయలేదు. పైగా, సినిమా కోసం, శిక్షణ ఇచ్చే సిబ్బంది హాలీవుడ్ నుండి, కొరియా నుండి కూడా వచ్చారు. కాబట్టి, ఇది ఒక టీమ్ వర్క్. ఏ ఒక్క వ్యక్తికి ఈ క్రెడిట్ దక్కదు.

ఈ రోజు (మే 20) కూడా విడుదలైన ధాఖడ్ మరియు భూల్ భూలయ్యా 2 మధ్య పోటీ గురించి కంగనా మాట్లాడుతూ.. రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలైనా రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story