సినిమా

NBK 107: బాలకృష్ణ 107వ చిత్రంలో విలన్‌గా ఓ స్టార్ హీరో..

NBK 107: అఖండ సక్సెస్ తర్వాత బాలకృష్ణతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు NBK 107 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NBK 107: బాలకృష్ణ 107వ చిత్రంలో విలన్‌గా ఓ స్టార్ హీరో..
X

NBK 107: నందమూరి బాలకృష్ణ తన 107వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరపై నవీన్, వై.రవిశంకర్, సివి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. హీరోయిన్‌గా శృతీహాసన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

కాగా ఈ చిత్రంలో విలన్‌గా కన్నడ స్టార్ దునియా విజయ్ నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన గోపీ చంద్ మలినేని, అఖండ సక్సెస్ తర్వాత బాలకృష్ణతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు NBK 107 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి ఈ చిత్రాన్ని 29 ఏప్రిల్ రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తోంది చిత్ర యూనిట్.

Next Story

RELATED STORIES