సినిమా

Katrina Kaif: కత్రినా కౌశల్ అతిథులకు 'స్వీట్ రిటర్న్ గిఫ్ట్'.. ఇంతవరకు ఎవరూ ఇలా..

Katrina Kaif: రుచికరంగా తయారు చేసిన స్వీట్లు.. ఓ నోట్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Katrina Kaif: కత్రినా కౌశల్ అతిథులకు స్వీట్ రిటర్న్ గిఫ్ట్.. ఇంతవరకు ఎవరూ ఇలా..
X

Katrina Kaif: వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ప్రత్యేక బహుమతిని అందించారు. వివాహానికి విచ్చేసిన అతిధులు గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. అయితే, ఈ జంట వచ్చిన అతిధులు వట్టి చేతులతో వెళ్లకూడదని ఓ మంచి బహుమతి ఇచ్చి పంపించారు.

ప్రియమైన తమ అతిథులకోసం స్వీట్ బాక్స్‌తో పాటు ఓ 'స్వీట్ నోట్' కూడా ఇచ్చి పంపించారు. విక్‌త్రినా అని అభిమానులు వారిని ప్రేమగా పిలుచుకునే విధంగా, రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఈ జంట డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు.

రుచికరంగా తయారు చేసిన స్వీట్లు.. ఓ నోట్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నోట్‌లో ఇలా ఉంది, " మా పెళ్లి కోసం మీరు ఎంతో దూరం నుండి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ రాక మాకు మరింత ఆనందాన్ని పంచింది.

వెడ్డింగ్ కార్డును కూడా వెరైటీగా ముద్రించారు. మీరు జైపూర్ నుండి రణథంబోర్ వరకు రోడ్ ట్రిప్‌ను ఆస్వాదిస్తారని మేము ఆశిస్తున్నాము. దారిలో తగిలిన సుందరమైన గ్రామాలు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. దయచేసి వేడుకకు హాజరయ్యే సమయంలో మీ మొబైల్ ఫోన్‌లను మీ రూమ్‌లో ఉంచండి. ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఏ ఒక్కరికీ అనుమతి లేదు. ప్రతి ఒక్కరిని ఓ కంట కనిపెట్టేందుకు మాకు వీలుపడదు. ఇందుకోసం షాదీ స్క్వాడ్‌ను కూడా నియమించాము.

Next Story

RELATED STORIES