కౌన్ బనేగా కరోడ్‌పతి: నటి హెలెన్ గురించి ప్రశ్న అడగడంతో..

కౌన్ బనేగా కరోడ్‌పతి: నటి హెలెన్ గురించి ప్రశ్న అడగడంతో..
క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 15లో, అమితాబ్ బచ్చన్ తోటి నటి హెలెన్ గురించి ఒక ప్రశ్న అడిగారు. దానికి పోటీదారు సమాధానం చెప్పలేకపోయాడు.

క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 15లో, అమితాబ్ బచ్చన్ తోటి నటి హెలెన్ గురించి ఒక ప్రశ్న అడిగారు. దానికి పోటీదారు సమాధానం చెప్పలేకపోయాడు. ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి యొక్క ఇటీవలి ఎపిసోడ్‌లో, హోస్ట్ మరియు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన మాజీ సహనటి హెలెన్‌పై ఒక ప్రశ్న వేశారు. పోటీదారు, లలిత్ కుమార్, ₹ 25 లక్షలకు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో అతడు ₹ 12,50,000 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అమితాబ్ బచ్చన్ లలిత్‌ను అడిగారు. "ఈ నటీమణులలో ఎవరు మయన్మార్‌లో జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తన కుటుంబంతో సహా భారతదేశానికి పారిపోయి వచ్చారు?" అని ఆప్షన్స్ - సులోచన, సురయ్య, నాదిరా మరియు హెలెన్ ఫోటోలను చూపించారు. లలిత్ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక ఆట నుండి నిష్క్రమించాడు. అప్పుడు అమితాబ్ సరైన సమాధానం హెలెన్ అని అతనికి చెప్పారు.

“హెలెన్, ఆమె కుటుంబం మయన్మార్‌ను తప్పించుకున్నారు... అప్పటికి దానిని బర్మా అని పిలిచేవారు. తప్పించుకుని భారతదేశానికి రావడానికి, వారు నదులు, పర్వతాలు, అడవుల గుండా మైళ్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది. బర్మాలో జపనీస్ ఆక్రమణ నుండి తప్పించుకోవడానికి, ఆమె కుటుంబం 1943 లో ఇలా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఆమె మన చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా మారింది. ఆమె డ్యాన్స్‌ని చూస్తే ఎవరైనా పరవశించిపోతారు” అని అమితాబ్ వివరించారు.

అమితాబ్ మరియు హెలెన్

హెలెన్‌తో కలిసి కొన్ని సినిమాల్లో కూడా పనిచేశానని మెగాస్టార్ తెలిపారు. “ఆమెతో కలిసి 2-3 సినిమాల్లో నటించే అదృష్టం కలిగింది. ఆమె దయగల మహిళ. ఆమె అందరినీ బాగా చూసుకునేది. ఆమె మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె ఇప్పుడు పెద్దవారైపోయారు అని చెప్పారు.

" హెలెన్‌కు ఇప్పుడు 85 ఏళ్లు కాగా, అమితాబ్‌కు 81 ఏళ్లు. వీరిద్దరూ కలిసి మొహబ్బతీన్, డాన్, అమర్ అక్బర్ ఆంథోనీ, ది గ్రేట్ గ్యాంబ్లర్ మరియు రామ్ బలరామ్ వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు.

చంద్ర బారోట్ యొక్క 1978 కల్ట్ యాక్షన్ థ్రిల్లర్ డాన్‌లో ఆశా భోంస్లే పాట యే మేరా దిల్ యార్ కా దివానాలో అమితాబ్, హెలెన్ నటించారు. వారిద్దరూ చివరిసారిగా కలిసి నటించిన చిత్రం ఆదిత్య చోప్రా దర్శకత్వంలో 2001 వచ్చిన రొమాంటిక్ చిత్రం మొహబ్బతే. ఆ చిత్రంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా నటించారు.

హెలెన్ తదుపరి అభినయ్ డియో యొక్క థ్రిల్లర్ సిరీస్ బ్రౌన్‌లో కనిపించనుంది. ఆమె ప్రముఖ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్‌ను వివాహం చేసుకుంది. నటుడు సల్మాన్ ఖాన్‌కు సవతి తల్లి.

Tags

Read MoreRead Less
Next Story