Yash: అమ్మ చాలా ఆప్యాయంగా: తారక్ తల్లి గురించి యశ్..

Yash: అమ్మ చాలా ఆప్యాయంగా: తారక్ తల్లి గురించి యశ్..
Yash: ఆరోజు ఎన్టీఆర్ తల్లి శాలిని గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు.

Yash: కన్నడ సూపర్ స్టార్ యశ్ నటించిన చిత్రం గురువారం విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పనిసరిగా రామ్ చరణ్ ని, తారక్ ని కలుస్తానని చెప్పారు యశ్. అలాగే హైదరాబాద్ లో ఎక్కడ షూటింగ్ చేసినా చరణ్ ఇంటి నుంచి భోజనం పంపిస్తాడు.. ఇక తారక్ మదర్ అయితే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు.

ఓ రోజు తనను డిన్నర్ కు ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు యశ్. ఆరోజు ఎన్టీఆర్ తల్లి శాలిని గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆమె కర్ణాటకలోని కుందాపూర్ (మంగుళూరు/ఉడిపి సమీపంలో)కి చెందినవారు కావడంతో మేము మా భాషలో మాట్లాడుకున్నాము అని చెప్పారు. మా మధ్య ప్రాంతీయ అనుబంధం ఉండడంతో ఆమె తనను చాలా ప్రత్యేకంగా చూసుకున్నారని చెప్పారు. కుటుంబంలోని వ్యక్తిగా ట్రీట్ చేశారు. వారు ఇచ్చిన ఆతిధ్యాన్ని ఎన్నటికీ మరువలేనని చెప్పారు యశ్.

Tags

Read MoreRead Less
Next Story