ఖుషి రివ్యూ.. వీకెండ్ ఓ మంచి సినిమా చూసిన అనుభూతి

ఖుషి రివ్యూ.. వీకెండ్ ఓ మంచి సినిమా చూసిన అనుభూతి
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు మరీ బోరు కొట్టిస్తున్నాయి

ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు మరీ బోరు కొట్టిస్తున్నాయి. థియేటర్ కు వెళ్లి ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని ఈ మధ్యన ప్రేక్షకులు ఫీలవ్వట్లేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషీ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు సంతృప్తిగా ఫీలయ్యారు. ఇందులో సమంత నటన సూపర్బ్ అని అంటున్నారు. ఇక విజయ దేవరకొండ గీత గోవిందాన్ని మరోసారి గుర్తు చేసాడు అని చెబుతున్నారు.

రివ్యూ విషయానికి వస్తే..

BSNL ఉద్యోగి విప్లవ్ (విజయ్ దేవరకొండ) కాశ్మీర్‌లో ఆరాధ్య (సమంత)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. విప్లవ్ నాస్తికుడు లెనిన్ సత్యం (సచిన్ ఖేడ్కర్) కుమారుడు. ఆరాధ్య ప్రముఖ ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) కుమార్తె అయినందున వారి వివాహం జరగడం దాదాపు అసాధ్యమని భావిస్తారు. మరి విప్లవ్, ఆరాధ్య ఎలా పెళ్లి చేసుకుంటారు, వారి వైవాహిక జీవితంలో ఏం జరుగుతుంది అనేదే ఖుషీ కథాంశం.

సమంత నటన తన మొదటి చిత్రాన్ని గుర్తు చేసింది. చాలా బాగా నటించింది. విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ బాగా పనిచేసింది. మిగిలిన వారు కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

అబ్బుర పరచిన సాంకేతిక నైపుణ్యం

ఖుషీ రిచ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ అసాధారణంగా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పాటలు హుందాగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో కాశ్మీర్ అందాలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం, డైలాగులు బాగున్నాయి.

ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువగా ప్రేమాయణం సాగుతుంది. మొదటి సగం కేవలం విప్లవ్, ఆరాధ్య గురించి మాత్రమే. అయితే, సెకండ్ హాఫ్ పూర్తిగా ఫ్యామిలీ మరియు ఎమోషనల్ డ్రామాకి సంబంధించినది.

నటీనటులు భావోద్వేగాలను, కామెడీని బాగా పండించారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి రెఫరెన్స్‌లోని ఒక ప్రత్యేక సన్నివేశం నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సుదీర్ఘమైన కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి.

ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మొత్తంమీద ఖుషీ అనేది వివాహం, అపార్థాలు, తల్లిదండ్రుల అహంకారాలు వంటి అంశాల మిశ్రమ కథాంశం. పాటలు, పిక్చరైజేషన్, కొన్ని కామెడీ సన్నివేశాలు మొత్తం మీద ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిచాయి. ప్రతి వారం ప్రేక్షకులపై దాడి చేస్తున్న ఆ డిజాస్టర్లతో పోలిస్తే ఖుషీకి మంచి మార్కులు పడతాయి. సో ఈ వీకెండ్ ఖుషీ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.

Tags

Read MoreRead Less
Next Story