సినిమా

Samantha: సమంత నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

టాలీవుడ్ బ్యూటీ సమంత మరో కొత్త చిత్రంలో నటించనుందంటే అభిమానులకు ఆసక్తి.. ఈసారి తను ఏ పాత్ర ఎంచుకుంది అని ఆరా తీస్తుంటారు.

Samantha: సమంత నుంచి మరో క్రేజీ అప్‌డేట్..
X

Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత మరో కొత్త చిత్రంలో నటించనుందంటే అభిమానులకు ఆసక్తి.. ఈసారి తను ఏ పాత్ర ఎంచుకుంది అని ఆరా తీస్తుంటారు. ఈ మధ్య తన చిత్రాల ఎంపికలో పరిణతి.. ఆ పాత్ర తన ఇష్టం స్పష్టంగా కనిపిస్తుంది.. అందులో జీవించేస్తుంది. అందుకే అభిమాన స్టార్ హీరోకి ఎంత క్రేజ్ ఉందో నటి సమంతకు కూడా ఆడియన్స్‌లో అంతే క్రేజ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ మధ్యే చిత్రీకరణ పూర్తిచేసుకున్న శాంకుతలం సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పౌరాణిక కథ శాకుంతలంలో శకుంతలగా సమంత పాత్రని దర్శకుడు ఎలా మలిచారో అని ఒకింత ఆసక్తి. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉంటే, తాజా నివేదికల ప్రకారం సమంత మరో మహిళ ప్రధాన ఇతి వృత్తంతో కూడిన చిత్రానికి ఆమోదం తెలిపిందని ఫిలిం నగర్‌లో టాక్.

నానితో జెంటిల్‌మన్, సుధీర్ బాబుతో సమ్మోహనం చిత్రాలు చేసిన ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇటీవల ఒక దర్శకుడు రాసిన స్క్రిప్ట్‌తో సమంతను సంప్రదించారు. సామ్‌కు ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసిందట. డేట్లు కూడా అడ్జెస్ట్ చేయడంతో ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నుంచి మొదలు పెట్టాలనుకుంటుందట చిత్ర యూనిట్. మరి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. అంతవరకు సామ్ అభిమానులు ఆగాల్సిందే.

Next Story

RELATED STORIES