లెజెండరీ కొరియోగ్రాఫర్ బయోపిక్‌ లో మాధురీ దీక్షిత్..!!

లెజెండరీ కొరియోగ్రాఫర్ బయోపిక్‌ లో మాధురీ దీక్షిత్..!!
లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితంపై ఆమె మొదటి వర్ధంతి జులై 3, 2021న భూషణ్ కుమార్ బయోపిక్‌ని ప్రకటించారు.

లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితంపై ఆమె మొదటి వర్ధంతి జులై 3, 2021న భూషణ్ కుమార్ బయోపిక్‌ని ప్రకటించారు. ఈ బయోపిక్‌ను T సిరీస్ నిర్మిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా సరోజ్ ఖాన్ పనిచేశారు. ఆమె జూలై 3 , 2020న 71 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. సరోజ్ ఖాన్ పాత్రను పోషించడానికి మాధురీ దీక్షిత్ పేరును పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

సరోజ్ ఖాన్ ప్రధానంగా హిందీ చిత్ర సినిమాలో పనిచేశారు. దాదాపు 3000 పాటలకు పైగా కొరియోగ్రఫీ చేశారు. ఆమె బాలీవుడ్‌లో మొదటి మహిళా కొరియోగ్రాఫర్. ఆమె అందమైన, స్టైలిష్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ కు ప్రసిద్ది చెందింది.

మేకర్స్ సరోజ్ జీ జీవితంలోని వివిధ దశలను తెరపై చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిలో నటించడానికి నటులను ఎంపిక చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక అమ్మాయి తన చిన్ననాటి రోజుల్లో సరోజ్ జీగా నటిస్తుంది, మరొకరు తన పాత వెర్షన్‌ను ప్లే చేస్తుంది. ఇలా నాలుగు పాత్రలు ఉంటాయి. ఇందులో ఒక పాత్ర కోసం మాధురిని పరిశీలిస్తున్నారు.

“ఖాన్ జీవితం ఎత్తుపల్లాలతో నిండినందున బయోపిక్ ద్వారా చూపించడానికి చాలా విషయాలు ఉన్నాయి. అందుకే కథను చూపించడానికి ఏ యాంగిల్‌ని ఎంచుకోవాలో రచయితలు ఇంకా సమాలోచనలు జరుపుతున్నారు. “6 నెలల క్రితం, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్ర గురించి చర్చలు జరిగాయి. ఇందుకోసం ఆమెను ప్రదించారు. మాధురీ కెరీర్ లో సరోజ్ ఖాన్ పాత్ర చాలా ప్రముఖమైనది.

ఆమె కొరియోగ్రాఫ్ చేసిన పాటల ద్వారానే మాధురీకి మంచి పేరు వచ్చింది. ధక్ ధక్ నుండి ఏక్ దో తీన్ వరకు - అన్నీ హిట్ అయ్యాయి. మాధురి కూడా సరోజ్ ఖాన్ తనకు కొరియోగ్రాఫ్ చేసేలా చూసుకునేది. అంతేకాకుండా, వారిద్దరూ చాలా సన్నిహిత బంధాన్ని కలిగి ఉండేవారు. మాధురికి కొరియోగ్రఫీ చేయడం సరోజ్ ఖాన్ కు చాలా సులభమయ్యేది.

సరోజ్ ఖాన్ జీవితం మరియు వృత్తి

సరోజ్ ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. మూడేళ్ల వయసులో నజరానా చిత్రంలో పాప శ్యామగా నటించింది. 1950వ దశకం చివరిలో, సరోజ నేపథ్య నృత్యకారిణిగా మారింది. 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే బి సోహన్‌లాల్‌తో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత ఈ జంట విడిపోయారు.

1975 లో, ఆమె వ్యాపారవేత్త సర్దార్ రోషన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. వారు ఒక పాప జన్మించింది. 70వ దశకంలో ఆమె పూర్తిగా కొరియోగ్రఫీపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఆమె గీతా మేరా నామ్‌తో కొరియోగ్రాఫర్‌గా మారింది.

మిస్టర్ ఇండియా (1987)లో హవా హవాయిలో శ్రీదేవితో కలిసి పనిచేసినప్పుడు సరోజ్ ఖాన్ పేరు మార్మోగిపోయింది. అప్పటి నుండి ఆమె బాలీవుడ్‌లో విజయవంతమైన కొరియోగ్రాఫర్‌లలో ఒకరిగా మారింది. ఆమె మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది.

Tags

Read MoreRead Less
Next Story