సినిమా

Mahesh Babu Businessman: 'బిజినెస్‌మెన్‌'కు పదేళ్లు.. నమ్రత పర్మిషన్‌తో కాజల్‌కి ముద్దు..

Mahesh Babu Businessman: తమిళనాడులోని కడలూరు జిల్లా నుండి ముంబైకి మారిన ఒక గ్యాంగ్‌స్టర్ యొక్క నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది.

Mahesh Babu Businessman: బిజినెస్‌మెన్‌కు పదేళ్లు.. నమ్రత పర్మిషన్‌తో కాజల్‌కి ముద్దు..
X

Mahesh Babu Businessman: సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు బిజినెస్‌మ్యాన్‌కు పదేళ్లు.. రామ్ గోపాల్ వర్మ కాన్సెప్ట్, పూరీ జగన్నాథ్ డైరెక్షన్, మహేష్ బాబు యాక్షన్ అన్నీ కలిసి బిజినెస్‌మ్యాన్‌ని బ్లాక్ బస్టర్ చేశాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నాజర్, సాయాజి షిండే, సుబ్బరాజు, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు.

74రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసిన తెలుగు చిత్రంగా ఈ చిత్రం నిలిచింది. థమన్ సంగీతం ఈ చిత్రానికి మరింత అందాన్ని తీసుకువచ్చింది. 40కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే.. 55 కోట్లకు పైగా రాబట్టి కమర్షియల్‌గా సక్సెస్ టాక్ అందుకుంది. 2012లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


ఈ చిత్రం బెంగాలీలో బాస్ పేరుతో రీమేక్ చేయబడింది. తమిళనాడులోని కడలూరు జిల్లా నుండి ముంబైకి మారిన ఒక గ్యాంగ్‌స్టర్ యొక్క నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో ముఖ్య విషయం ఇందులో కాజల్, మహేష్ బాబుల మధ్య ముద్దు సీన్ ఉంటుంది.. సినిమాలో అది భాగమే అయినా ఆ సీన్ చేయడానికి మహేష్ వెనుకాడాడు.. నమ్రత పర్మిషన్ తీసుకున్నాకే ఆ సీన్ చేయడానికి అంగీకరించాడని పూరీ ఒకానొక సందర్భంలో తెలిపారు.

వి లవ్ బ్యాడ్ బాయ్స్ అని ఓ ఐటెం సాంగ్ పెట్టారు ఈ చిత్రంలో పూరీ.. అయితే ఈ సాంగ్ చేసేందుకు పూరీ మొదట హన్సికని అనుకున్నారు.. కానీ ఆమె అంగీకరించకపోవడంతో నటి శ్వేతా భరద్వాజ్‌ను ఎంపిక చేశారు. ఆమె కూడా ఆ పాటలో ఎక్స్‌పోజింగ్ పాలు ఎక్కువగా ఉందని చేయడానికి భయపడినా కొరియోగ్రాఫర్ పట్టుబట్టి మరీ చేయించారు. కాగా, ఈ చిత్రం హిందీ రీమేక్‌లో నటించడానికి మహేష్ బాబు నిరాకరించడంతో, పూరీ రణబీర్ కపూర్‌‌తో ఆ చిత్రాన్ని చేయాలనుకున్నారు.. కానీ పట్టాలెక్కలేదు.. అభిషేక్ బచ్చన్‌తో చేయాలనుకున్నారు. అదీ వర్కవుట్ కాలేదు.

Next Story

RELATED STORIES