Mahesh Babu: మహేశ్ బాబుకి సర్జరీ.. షూటింగ్‌కి బ్రేక్..

Mahesh Babu: మహేశ్ బాబుకి సర్జరీ.. షూటింగ్‌కి బ్రేక్..
Mahesh Babu: అందుకే తన తాజా చిత్రం సర్కారు వారి పాటకి కూడా బ్రేక్ ఇచ్చి ట్రీట్‌మెంట్ కోసం వెళుతున్నారు.

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్ బాబు మోకాలి శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌లో పాల్గొనడం కూడా కష్టంగా ఉన్నట్లుంది.

అందుకే తన తాజా చిత్రం సర్కారు వారి పాటకి కూడా బ్రేక్ ఇచ్చి ట్రీట్‌మెంట్ కోసం వెళుతున్నారు. మహేష్ బాబుకి సర్జరీ జరిగి, పూర్తిగా కోలుకున్నాక మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అందుకే రెండు నెలల పాటు షూటింగ్‌ను వాయిదా వేసినట్లు సమాచారం.

కాగా, మహేష్ అభిమానులకు ఈ విషయం తెలిసి తమ అభిమాన నటుడు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకుని పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ట్విట్టర్‌లో #GETWELLSOONMAHESHBABU అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తమ హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story