బాలీవుడ్ లో ఆఫర్లు.. మకాం మార్చిన మంచు లక్ష్మి

బాలీవుడ్ లో ఆఫర్లు.. మకాం మార్చిన మంచు లక్ష్మి
టాలెంట్ ఉన్నా, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కాసింత అదృష్గం కూడా ఉంటేనే అవకాశాలు వస్తాయి.

టాలెంట్ ఉన్నా, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కాసింత అదృష్గం కూడా ఉంటేనే అవకాశాలు వస్తాయి. మంచి నటిగా మంచు లక్ష్మి మంచి పేరే తెచ్చుకుంది. అయినా టాలీవుడ్ లో అవకాశాలు అంతంత మాత్రమే. హాలీవుడ్ లో సైతం యాక్ట్ చేసి వచ్చి మంచు లక్ష్మికి అవకాశాలు రావట్లేదన్న బాధ కంటే తనలో ఉన్న నటిని ఇండస్ట్రీ ఉపయోగించుకోవట్లేదన్నది తన ఫీలింగ్. దాంతో బాలీవుడ్ లో వస్తున్న అవకాశాలను వినియోగించుకునేందుకు మంచు లక్ష్మి మకాం ముంబైకి మార్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

"న్యూ సిటీ, న్యూ ఎరా. ఈ జీవితానికి చాలా కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నన్ను ఆదరిస్తున్నందుకు మరియు నమ్ముతున్నందుకు నా అభిమానులందరికీ ధన్యవాదాలు. #ముంబై" అని రాసింది. తాను అంగీకరించిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించేందుకు సులువుగా ఉంటుందని ముంబైకి షిప్ట్ అయినట్లు పేర్కొంది.

ఓక్లహోమా సిటీ యూనివర్సిటీలో చదువుకున్న మంచు లక్ష్మి తెలుగు చాలా ప్రత్యేకం. చాలా మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన లక్ష్మీ టాక్ షో తో తెలుగులో ఫేమస్ అయ్యింది. మంచి నటనా నైపుణ్యంతో పాటు కష్టాల్లో ఉన్న తోటి వారిని చూసి వెంటనే స్పందించే గుణం ఉన్న మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు గారాల పట్టి. విష్ణు, మనోజ్ ఇద్దరు సోదరులైనా మనోజ్ తో ఎక్కువ చనువుగా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story