Tamil Villan Ponnambalam: చిరంజీవి వల్లే ఈ రోజు నేను ఇలా: తమిళ నటుడు

Tamil Villan Ponnambalam: చిరంజీవి వల్లే ఈ రోజు నేను ఇలా: తమిళ నటుడు
Tamil Villan Ponnambalam: తెరపైనే హీరో కాదు, తెర వెనుక కూడా హీరో అతడు.. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీ అతడిని మెగాస్టార్ అని గొప్పగా పిలుచుకుంటుంది. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందు నిలబడే వ్యక్తి చిరంజీవి.

Tamil Villan Ponnambalam: తెరపైనే హీరో కాదు, తెర వెనుక కూడా హీరో అతడు.. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీ అతడిని మెగాస్టార్ అని గొప్పగా పిలుచుకుంటుంది. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందు నిలబడే వ్యక్తి చిరంజీవి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పొన్నంబలం ఏడాది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అతడు తన వైద్య చికిత్సకు సహాయం చేయవలసిందిగా పరిశ్రమలోని స్నేహితులకు, సహచరులకు విజ్ఞప్తి చేశాడు. దానికి వెంటనే స్పందించిన చిరంజీవి పొన్నాంబలం‌కు ఫోన్ చేసి మరికొద్ది సేపట్లో నీకు అపోలో నుంచి ఫోన్ వస్తుంది.. వెళ్లి జాయిన్ అవ్వు అని చెప్పారు. దాంతో హాస్పిటల్‌కు వెళ్లిన అతడిని సిబ్బంది ఏ ఫీజూ తీసుకోకుండా జాయిన్ చేసుకున్నారు. మొత్తం చికిత్లు పూర్తి చేసి పంపించారు. బిల్లు చూస్తే రూ.45 లక్షలు ఖర్చయింది.. ఒక్క పైసా కూడా తాను చెల్లించలేదని తెలిపారు. తన గొప్ప సంజ్ఞకు ధన్యవాదాలు చెప్పడం మనం చూడవచ్చు. అదేవిధంగా, ధనుష్ తనకు ఆర్థికంగా కూడా సహాయం చేశాడని పేర్కొన్నాడు. పొన్నంబలం మేనకోడలు జగన్నాథన్ తన కిడ్నీని మామకు దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫిబ్రవరి 10న శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించగా, పొన్నంబలం ప్రస్తుతం కోలుకుంటున్నారు. పొన్నంబలం విజయకాంత్, రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్ సర్జా మరియు శరత్‌కుమార్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు.

Tags

Read MoreRead Less
Next Story