సినిమా

Krishna Vamsi: థ్యాంక్యూ అన్నయ్య.. మీది ఎంతో మంచి మనసు.. నా కోసం ..: కృష్ణవంశీ

Krishna Vamsi: మీరు వెంటనే ఓకే చేయడం.. మీ గొప్పతనానికి నిదర్శనం.

Krishna Vamsi: థ్యాంక్యూ అన్నయ్య.. మీది ఎంతో మంచి మనసు.. నా కోసం ..: కృష్ణవంశీ
X

Krishna Vamsi: మరాఠీ హిట్ చిత్రం 'నట సామ్రాట్' చిత్రానికి 'రంగమార్తాండ' రీమేక్. ఈ చిత్రాన్ని కృష్ణవంశీ రూపొందిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తయింది కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా గురించి విషయాలేవీ పెద్దగా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు కృష్ణ వంశీ ఓ సంచలన ప్రకటన చేశారు.

ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి తప్ప మరెవరూ వాయిస్ ఓవర్ ఇవ్వరని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థ్యాంక్యూ అన్నయ్యా మీది ఎంతో మంచి మనసు. నా సినిమా కోసం మిమ్మల్ని వాయిస్ ఓవర్ చేయమని నేను అడగడం.. మీరు వెంటనే ఓకే చేయడం.. మీ గొప్పతనానికి నిదర్శనం. ఈ చిత్రానికి మీ వాయిస్ కచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది అంటూ ట్విట్టర్ అకౌంట్‌లో చిరు డబ్బింగ్ చెబుతున్న స్టిల్‌ని పోస్ట్ చేశారు కృష్ణ వంశీ. ఈ ఫోటోను చూసి మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

'రంగ మార్తాండ' చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరాఠీలో నానా పటేకర్ పోషించిన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రంగమార్తాండ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Next Story

RELATED STORIES