సినిమా

'తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు': చిరు స్పెషల్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు: చిరు స్పెషల్ విషెస్
X

మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేనాని 50వ బడిలో అడుగిడిన రోజు. ఆత్మీయులు, అభిమానులు శుభాకాంక్షలతో ఆయనను ముంచెత్తుతున్నారు. పలువురు సినీ, రాజకీయనాయకులు పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో అన్నయ్య చిరంజీవి స్పెషల్‌గా విష్ చేశారు. చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన.. ప్రతి అడుగు. పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం.. కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES