మోకాలికి సర్జరీ.. సినిమాలకు బ్రేక్

మోకాలికి సర్జరీ.. సినిమాలకు బ్రేక్
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి సర్జరీ చేయించుకోనున్నట్లు సమాచారం..

మెగాస్టార్ చిరంజీవి మోకాలికి సర్జరీ చేయించుకోనున్నట్లు సమాచారం.. ఈ క్రమంలో సినిమాలకు కొంత కాలం విరామం ఇవ్వనున్నారు.. 70లకు చేరువవుతున్నా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు వరుస సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. తీరిక లేకుండా శ్రమించడంతో మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు మోకాలికి శస్త్ర చికిత్స చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

శస్త్ర చికిత్స తరువాత పూర్తిగా కోలుకున్నాకే తరువాతి ప్రాజెక్టుకు సైన్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే చర్చలు పూర్తయిన ఓ ప్రాజెక్ట్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో అని సమాచారం. ఇది మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీకి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శర్వానంద్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరించనుంది. ఇది కామెడీ, రొమాంటిక్ అంశాల మేళవింపు.

కానీ భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో చిరంజీవి తన ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇకపై రీమేక్‌లు చేయొద్దని అభిమానులు చిరును గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బ్రో డాడీ రీమేక్‌ను పక్కన పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారో వేచి చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story