Tollywood: మిస్ ఇండియాతో జోడీ కడుతున్న నాగార్జున..

Tollywood: మిస్ ఇండియాతో జోడీ కడుతున్న నాగార్జున..
Tollywood: 60ల్లోనూ అదే అందం. అంతే ఎనర్జీ. యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని నటుడు నాగార్జున.

Tollywood: 60ల్లోనూ అదే అందం. అంతే ఎనర్జీ. యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని నటుడు నాగార్జున. ఈ మధ్య ఆయన నటిస్తున్న సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. మునుపటి కంటే మరింత ఉత్సాహంతో నటించడానికి రెడీ అయిపోతున్నారు నాగార్జున. కుటుంబ కథా చిత్రాలకంటే యాక్షన్ చిత్రాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా రైటర్ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఓ పక్కా కమర్షియల్ చిత్రంలో నటించడానికి ప్లాన్ చేసారు.

ఇక నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మిస్ ఇండియా మానస వారణాసిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యూటీ తెలుగులో బ్రేక్ ఈవెన్ కోసం ఎదురు చూస్తోంది. కొత్త వారితో నటించడానికి నాగార్జున ఎప్పుడూ రెడీగానే ఉంటారు. మానస కూడా నాగార్జునతో నటించేందుకు ఉత్సాహం చూపుతోంది. అయితే 60 ఏళ్లు పైబడిన నటులు మరీ ఇంత చిన్న వయసు వారితో నటిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో చూడాలి. మన్మధుడు 2 లో రకుల్ ప్రీత్ సింగ్, నాగార్జున పెయిర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story