Mounika-Manoj: పెళ్లి తర్వాత దిగిన మొదటి ఫోటో.. షేర్ చేసిన మౌనిక

Mounika-Manoj: పెళ్లి తర్వాత దిగిన మొదటి ఫోటో.. షేర్ చేసిన మౌనిక
Mounika-Manoj: ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు.. ఇంట్లో వాళ్లు అభ్యంతర పెట్టినా అక్క అండగా ఉంది..

Manoj-Mounika: ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు.. ఇంట్లో వాళ్లు అభ్యంతర పెట్టినా అక్క అండగా ఉంది.. అంతకంటే కావల్సింది ఏముంది అనుకున్నాడు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్.. 12 ఏళ్ల పరిచయం. నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. భార్య మౌనికతో కలిసి ఓ టాక్ షోకు వెళ్లిన మనోజ్ తన మనసులో కొనసాగుతున్న మానసిక సంఘర్షణను పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా మౌనిక తొలిసారిగా భర్త మంచు మనోజ్‌తో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని మౌనిక పెళ్లి ఫోటోలను కూడా ఇంతవరకు షేర్ చేయలేదు. తాజాగా ఓ టాక్ షోకి హాజరైన సందర్భంలో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాలో సంచుకుంది. ఇక ఈ ఫోటోలో మౌనిక ధరించిన చీర సెలబ్రిటీ స్టైలిస్ట్ సబ్యసాచి డిజైన్ చేసింది. ఈ పిక్‌ను చూసిన నెటిజన్లు బ్యూటీఫుల్ కపుల్.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story