Nag Ashwin: మహీంద్రా సర్.. మా 'ప్రాజెక్ట్ కే' కి సాయం చేస్తారా..: నాగ్ అశ్విన్ ట్వీట్

Nag Ashwin: మహీంద్రా సర్.. మా ప్రాజెక్ట్ కే కి సాయం చేస్తారా..: నాగ్ అశ్విన్ ట్వీట్
Nag Ashwin: టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా తనకు ప్రేరణ మహీంద్రా సర్ అంటారు.

Nag Ashwin: ఆనంద్ మహీంద్రా అంటే తెలియని వాళ్లెవరు.. మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో గానే కాదు సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్ ఆయన.. ఎక్కడో మారుమూల ఉన్న ప్రతిభ ని వెలుగులోకి తీసుకువస్తారు.. వీలైనంత సాయం చేస్తారు.. అందుకే అందరికీ మహీంద్రా ఓ మంచి రోల్ మోడల్. టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా తనకు ప్రేరణ మహీంద్రా సర్ అంటారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కె ప్రభాస్ చిత్రం భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. దీనికి సాంకేతిక సాయం కావాలంటూ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు నాగ్ అశ్విన్..


సినిమాకి, ఆయనకి సంబంధం ఏంటని చాలా మంది అనుకుంటారు.. అసలు విషయానికి వస్తే.. సినిమా కోసం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మించి అధునాతనమైన, విభిన్నమైన వాహనాలను ఈ సినిమా కోసం డిజైన్ చేయిస్తున్నాం. ఒకవేళ మా కల నిజమైతే.. అది మన దేశానికే గర్వకారణం. భారతదేశంలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సినిమా రాలేదు. అందుకే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంజనీర్ల విషయంలో మీ నుంచి మాకు ఏదైనా సాయం ఉంటే నేను ఎంతో సంతోషిస్తాను.. అని నాగ్ అశ్విన్.. ఆనంద్ మహీంద్రాకి ట్యాగ్ చేశారు.

ప్రాజెక్ట్ కేలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె వంటి ప్రముఖ తారలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్ద వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story