సినిమా

Naga Chaitanya: మా నాగలక్ష్మి తర్వాతే బంగార్రాజు.. చై క్రేజీ ట్వీట్

Naga Chaitanya: అరుదుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే నాగచైతన్య నాన్న నాగార్జున నటిస్తున్న బంగార్రాజు చిత్రంలో నటిస్తున్నాడు.

Naga Chaitanya: మా నాగలక్ష్మి తర్వాతే బంగార్రాజు.. చై క్రేజీ ట్వీట్
X

Naga Chaitanya: అతడిలోని హ్యూమరస్ యాంగిల్ అప్పుడప్పుడు బయటకు వస్తుంది. అరుదుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే నాగచైతన్య నాన్న బంగార్రాజు చిత్రంలో నటిస్తున్నాడు. కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగచైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంబంధించిన కృతిశెట్టి లుక్‌ను మూవీ మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. కృతి లుక్‌ను చై తన ట్విటర్‌లో షేర్ చేశాడు. బాగుందిరా అబ్బాయ్.. మరి బంగార్రాజు విషయం ఏంటి అని ప్రశ్నించారు పోస్టర్ చూసిన నాగార్జున.

దీనికి చైతూ కూడా అంతే సరదాగా సమాధానం ఇచ్చాడు తండ్రికి. బంగార్రాజు త్వరలోనే వస్తాడు.. లేడీస్ ఫస్ట్ కదా.. అందుకే మా నాగలక్ష్మి ఫస్ట్ లుక్ షేర్ చేస్తున్నాం అని తండ్రిని ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశాడు. తొలిసారిగా చై సరదా సంభాషణలు విన్న ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది బంగార్రాజు యూనిట్. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఈ చిత్రంలో నాగార్జున పాడిన పాట లడ్డుండా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Next Story

RELATED STORIES