Naga Chaitanya: నాగచైతన్య బ్రేకప్ లవ్‌స్టోరీ..

Naga Chaitanya: నాగచైతన్య బ్రేకప్ లవ్‌స్టోరీ..
Naga Chaitanya: పీకల్లోతు ప్రేమలో మునిగిన చైతూ ఆమెతో డేటింగ్ కూడా చేసినట్లు సమాచారం.

Naga Chaitanya: నాగచైతన్య పక్కన మరొకరిని ఊహించుకోగలమా.. సామ్, చైతూ జంట అంత చూడముచ్చటగా ఉంటుంది మరి. వాళ్లిద్దరు కూడా ఓ దశాబ్దకాలం పాటు ప్రేమించుకునే కదా పెళ్లి చేసుకుంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చైతూ, శ‌ృతిహాసన్‌ల మధ్య లవ్ ట్రాక్ నడిచిందని. ఈ వార్త వైరల్ కావడంతో వారిద్దరి మద్య అంత సీన్ ఉందా అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. శృతి హాసన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన చైతూ ఆమెతో డేటింగ్ కూడా చేసినట్లు సమాచారం.



2013 సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నైట్‌లో ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం బయటి ప్రపంచానికి తెలిసింది. శృతి, నాగ చైతన్య మధ్య సీరియస్ రిలేషన్‌షిప్ నడిచిందని టాక్. వీరిద్దరూ 'ప్రేమమ్' సినిమాలో కలిసి నటించారు. 2018లో ఆ మూవీ రిలీజ్ అయింది. శృతి, చైతూ లవ్ ట్రాక్ నడిచిన టైమ్‌లోనే అంటే 2017లోనే చైతూ, సామ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. నాలుగేళ్ల వారి వివాహ బంధానికి తెరపడి ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు.

తాజాగా సమంతకు హాలీవుడ్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. అదే అరేంజ్‌‌మెంట్స్ ఆఫ్ లవ్. భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన పుస్తకానికి నవలా రూపం ఈ చిత్రం. 2004లో అత్యధికంగా అమ్ముడైన నవల ఇది. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.

Tags

Read MoreRead Less
Next Story