సినిమా

Unstoppable with NBK: బాలయ్య మనసు బంగారం.. చిట్టి తల్లికి పెద్ద సాయం..

Unstoppable with NBK: ఎన్నెన్నో చేస్తాం.. అన్నీ చెప్పుకుంటామా ఏంటి.. ఇది సినిమాలో డైలాగ్ కాదు..

Unstoppable with NBK: బాలయ్య మనసు బంగారం.. చిట్టి తల్లికి పెద్ద సాయం..
X

Unstoppable with NBK: ఎన్నెన్నో చేస్తాం.. అన్నీ చెప్పుకుంటామా ఏంటి.. ఇది సినిమాలో డైలాగ్ కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణ 'అనస్టాపబుల్' టాక్ షోలోని ఓ డైలాగ్.. ఈసారి గెస్ట్‌గా నేచురల్ నానీని ఆహ్వానించారు బాలయ్య. సినిమాల్లో బాలయ్య తొడకొడితే.. థియేటర్లో ప్రేక్షకులు జై కొడతారు. ఆయన అభిమానులు ఆయన చేసే ఫైట్లకు, ఫీట్లకు ఫిదా అవుతుంటారు.

బాలయ్య సినిమా వస్తుందంటే బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ ఈలలు, గోలలతో అరిచి మరీ చెబుతారు. ఆయనలో నటుడే కాదు ఆపన్నులను ఆదుకునే మంచి మనిషి కూడా ఉన్నాడు. ఆయన ఔదార్యం అనిర్వచనీయం. అమ్మ బసవతారకం పేరుతో నిర్మించిన ఆస్పత్రిలో క్యాన్సర్ పేషెంట్లకు సకాలంలో చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతుంటారు అక్కడి డాక్టర్లు.

క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే కీమో థెరపీ అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అది భరించలేని నిరుపేదలు బాలయ్యను సాయమడిగితే తక్షణం స్పందిస్తారు. ఖర్చులో కొంతైనా తగ్గేలా చూస్తారు. ఆయన మాటతో 2011లో ఓ చిన్నారికి ఉచితంగా క్యాన్సర్ చికిత్స జరిగింది.

పెదవడ్లపూడికి చెందిన వినీలాంబకు కడుపులో గడ్డ ఉందని వైద్యులు చెప్పారు. దాంతో ఎన్ని ఆస్పత్రులు తిరిగినా వైద్యులు చికిత్సకు నిరాకరించారు. మంచి మనసున్న బాలయ్యను సంప్రదించగా.. ఆయనే దగ్గరుండి ఆరోగ్య శ్రీ లేకపోయినా ఉచితంగా కీమో చేయించారు. పాప కోలుకోవడానికి కారణమయ్యారని తల్లి షోలో వివరించింది. బాలయ్యకు షోలో సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన వినీలాంబ ఆయనకు కాళ్లకు దండం పెట్టి తనకు ప్రాణకు పోసిన దేవుడిగా బాలకృష్ణను కీర్తించింది.

Next Story

RELATED STORIES