Bigg Boss Telugu Season 5: బిగ్‌బాస్ హౌస్‌లో పాములు, గుంటనక్కలు: నటరాజ్ మాస్టర్‌

Bigg Boss Telugu Season 5: బిగ్‌బాస్ హౌస్‌లో పాములు, గుంటనక్కలు: నటరాజ్ మాస్టర్‌
Bigg Boss Telugu Season 5: హౌస్‌లోని సభ్యులు ఏ మాత్రం ఊహించలేదు ఈసారి నటరాజ్ మాస్టర్ వెళ్లి పోతాడని

Bigg boss telugu season 5: బుల్లి తెర షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 వీకెండ్ శని, ఆదివారాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. కానీ కంటెస్టెంట్లకు హడల్.. ఈ సారి ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోతారో ఎవరికీ అర్థం కాదు. అప్పటి వరకు జరిగిన ఓటింగ్, అప్పటి కప్పుడు పెట్టిన గేమ్స్ వాళ్ల ఎలిమినేషన్‌ని నిర్ణయిస్తాయి. హౌస్‌లోని సభ్యులు ఏ మాత్రం ఊహించలేదు ఈసారి నటరాజ్ మాస్టర్ వెళ్లి పోతాడని. గేమ్ బాగా ఆడతాడు.. ఎవరి జోలికీ వెళ్లడు.. కాకపోతే తనను ఎవరు ఏమైనా అంటే తన తప్పు ఉన్నా ఒప్పుకోడు.. అదే దెబ్బ కొట్టి ఉంటుంది అతడి ఎలిమినేషన్‌కి అదే కారణమై ఉంటుంది.

నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారని తెలిసి యానీ మాస్టర్ వెక్కి వెక్కి ఏడ్చింది. రేపటి నుంచి నాకు ఉల్లిపాయలు కోసేది ఎవరు.. దోశలు పెట్టేది ఎవరు అని లోబో కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ప్రియాంక కూడా మాస్టర్ చేసిన తప్పేంటి అని అతడి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రశ్నించింది. ఇక షోలో భాగంగా బయటకు వెళ్లి పోయే కంటెస్టెంట్లు లోపల ఎవరు ఎలా ఉంటారో వాళ్ల దృష్టి కోణంలో చెప్పమంటారు. దాంతో నటరాజ్ మాస్టర్‌కి జంతువులు ఇష్టమని తెలిసి కంటెస్టెంట్లను జంతువులతో పోల్చమన్నారు. ముందుగా సిరిని తీసుకుని ఆమె పాము లాంటిది. తన జోలికి వస్తే కాటు వేస్తుంది.. లేదంటే తన పని తాను చేసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు. లోబో ఎలుకలా దూరి వంటగదిలో ఉన్న ఆహార పదార్థాలన్నీ తినేస్తాడని చెప్పాడు. విశ్వ ఊసరవెల్లి అని ఎదుటివారితో మంచి అనిపించుకోవాలని చూడకు అని సలహా ఇచ్చాడు. శ్రీరామ చంద్ర మొసలిలాంటి వాడని, లేనట్టే కనిపిస్తాడు. కానీ ఇట్టే పట్టేస్తాడు. మూడో వారం నుంచి ఆటను మార్చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇక చివరిగా గుంటనక్క రవి అనే విషయాన్ని బయటపెట్టాడు. అందరికంటే ఎక్కువ తెలివి వుంటుందని, కానీ అందరి విషయాల్లో తొంగి చూస్తాడు అని నటరాజ్ మాస్టర్ చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story