కేరళలో నయనతార కొత్త బిజినెస్

కేరళలో నయనతార కొత్త బిజినెస్
నయనతార తన కెరీర్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటీవల ఆమె నటించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచినప్పటికీ, నటి రాబోయే చిత్రాలపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

నయనతార తన కెరీర్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటీవల ఆమె నటించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచినప్పటికీ, నటి రాబోయే చిత్రాలపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తల్లి అయిన తర్వాత, నటి తన సినిమాలను తగ్గిస్తుందని కొన్ని వార్తలు వినిపించాయి. కానీ దీనికి విరుద్ధంగా ఒకదాని తర్వాత ఒకటి కొన్ని కొత్త సినిమాలను ప్రకటిస్తోంది. తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి నిర్మాణ రంగంలో కూడా చురుకుగా పాల్గొంటోంది.

రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ కెరీర్‌లో నయనతార సంపాదన తక్కువేమీ కాదు. ప్రైవేట్ జెట్ మరియు లగ్జరీ కార్ల సేకరణతో నయనతారకు సినిమాలే కాకుండా ఇతర ఆదాయ వనరులు ఉన్నాయి. నయన్ కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ యాక్టివ్ గా ఉంది. లిప్ బామ్ కంపెనీ అనే కాస్మెటిక్ బ్రాండ్‌లో కూడా నయన్ అడుగు పెట్టింది. ఇప్పుడు కొత్తగా మరో బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళ మీడియా కథనాల ప్రకారం, నయనతార తన కొత్త ప్రాజెక్ట్‌లను కేరళలో చేస్తోంది. నయనతార తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా కేరళలో చాలా స్థలాలు కొనుగోలు చేసింది. వీటిలో కొన్ని చోట్ల సకల సౌకర్యాలతో కూడిన భవనాలు నిర్మించి విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విఘ్నేష్ శివన్‌కి ఈ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. దీనికి నయనతార అంగీకరించినట్లు సమాచారం. పలు అంతర్జాతీయ కంపెనీలలో కూడా పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల, నటి యుఎఇలోని ఒక ఆయిల్ కంపెనీలో కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటు సినిమాలతో పాటు అటు బిజినెస్ లోనూ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి నయనతార. నటి రెమ్యునరేషన్ 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. అరుదుగా మాత్రమే తక్కువ రెమ్యునరేషన్ కు నటిస్తుంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం జవాన్. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌ తో నయన్ జత కట్టింది.

ఈ మధ్య ఆమె నటించిన కనెక్ట్ కానీ, గోల్డ్ కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సో.. ఇప్పుడు నయన్ కు కంపల్సరీ సక్సెస్ కావాలి. లేదంటే ఆమె సినిమా కెరీర్ మూలన పడే ప్రమాదం ఉంది. మరోవైపు భర్త విఘ్నేష్ శివన్ ఇటీవలే నటుడు అజిత్ తో ఓ చిత్రాన్ని తీసేందుకు సిద్ధపడ్డారు. ఆ చిత్రానికి అతడే దర్శకత్వం వహిస్తున్నట్లు సినిమా ముందు ప్రకటించింది. కానీ చిత్ర యూనిట్ మాగిర్ తిరుమేణి అనే దర్శకుడిని తీసుకున్నారు. ఈ నిర్ణయం నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌దే. చివరి దశలో దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం విఘ్నేష్‌ని బాగా బాధించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విఘ్నేష్ ఆ విషయాన్ని వెల్లడించాడు.

విఘ్నేష్, నయనతారల మొదటి వివాహ వార్షికోత్సవం ఇటీవల జరుపుకున్నారు. గత ఏడాది జూన్ 9న చెన్నైలో నయనతార, విఘ్నేష్‌ల వివాహం జరిగింది. వీరు సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story