సినిమా

Nithya Menen: ప్రభాస్ ఎవరో నాకు తెలీదు అన్నాను.. అందుకే..: నిత్యామీనన్

Nithya Menen: ఒకప్పుడు ఇతర పరిశ్రమలలో ఒకటిగా తెలుగు సినీ పరిశ్రమను కూడా పరిగణించేవారు.

Nithya Menen: ప్రభాస్ ఎవరో నాకు తెలీదు అన్నాను.. అందుకే..: నిత్యామీనన్
X

Nithya Menen: ఒకప్పుడు ఇతర పరిశ్రమలలో ఒకటిగా తెలుగు సినీ పరిశ్రమను కూడా పరిగణించేవారు. కానీ గతకొంతకాలంగా టాలీవుడ్‌లో కంటెంట్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. కథల విషయంలో, కథనాల విషయంలో టాలీవుడ్ కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకే ప్రతీ ఇండస్ట్రీ చూపు టాలీవుడ్ వైపు పడింది. ఒకప్పుడు ఇతర భాషా హీరోయిన్లు టాలీవుడ్ గురించి, ఇక్కడ నటీనటుల గురించి ఏమీ తెలుసుకోకుండానే తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టేవారు.

అలాగే మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్‌కు కూడా టాలీవుడ్‌లో అడుగుపెట్టే సమయానికి తనకు టాలీవుడ్ నటీనటుల గురించి ఏమీ తెలీదంటూ అప్పటి అనుభవాలను గుర్తుచేసుకుంది. నిత్యామీనన్ అసలు హీరోయిన్ అవుతానని అనుకోలేదని ఇప్పటికీ చాలా సందర్భాల్లో బయటపెట్టింది. అయినా తనకు అనుకోకుండా 'అలా మొదలైంది' సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలిపింది.

టాలీవుడ్‌కు వచ్చిన కొత్తలో తనను ప్రభాస్ గురించి అడగగా.. తనకు ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పింది. దాంతో తనపై ట్రోలింగ్ జరిగింది. ఇప్పటికీ అది గుర్తుచేసుకుంటే బాధగా ఉంటుందని తెలిపింది నిత్యామీనన్. తానేదో పెద్ద తప్పు చేసినట్టుగా అప్పట్లో న్యూస్ క్రియేట్ చేశారని చెప్పింది. ఇటీవల ఓ షోలో పాల్గొన్న నిత్యామీనన్ ఈ విషయాలను బయటపెట్టింది.

Next Story

RELATED STORIES