Nitya Menon: నిత్యామీనన్.. పంతులమ్మగా మారిన వేళ

Nitya Menon: నిత్యామీనన్.. పంతులమ్మగా మారిన వేళ
Nitya Menon: ఆమెకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువే అన్నా అస్సలు పట్టించుకోదు.. నేనిలానే ఉంటాను.. యాక్సెప్ట్ చేయకపోతే మీ ఇష్టం అనే ఈ ఉంగరాల జుట్టు చిన్నది చేసిన సినిమాలు చాలా తక్కువే

Nitya Menon: ఆమెకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువే అన్నా అస్సలు పట్టించుకోదు.. నేనిలానే ఉంటాను.. యాక్సెప్ట్ చేయకపోతే మీ ఇష్టం అనే ఈ ఉంగరాల జుట్టు చిన్నది చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా అన్నీ గుర్తుండిపోయే పాత్రలే. ముద్దుగా బొద్దుగా ఉండే నిత్య నటిగా మంచి ప్రశంసలు అందుకుంది. నటనతో పాటు గాత్రం కూడా ఆమెను మరో మెట్టు పైన నిలబెడుతుంది. తాజాగా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు వెళ్లింది చిత్ర యూనిట్. అక్కడ షూటింగ్ ముగిసిన తరువాత పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడ సందడి చేసింది నిత్య. అంతేకాదు అక్కడ ఉన్న విద్యార్ధులకు పాఠం చెబుతాననడంతో తగరతి ఉపాధ్యాయుడు ఆమెకు అవకాశం ఇచ్చారు.


మాస్టారు ఇచ్చిన ఇంగ్లీష్ పుస్తకం చేతబట్టి పిల్లలకు పాఠాలు చెప్పింది. ఆ తరువాత వాటిని తెలుగులోనూ పిల్లలకు అర్థమయ్యేలా బోధించి ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కృష్ణాపురం గ్రామంలో ఉన్న చిన్నారులతో నా న్యూయర్ డే గడిచింది. బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్న ఈ చిన్నారులను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆమె రాసుకొచ్చారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని చూసి నిత్య.. వెల్ టాలెంటెడ్ యాక్టర్. తెలుగు బాగా మాట్లాడుతోంది అని కామెంట్లు పెడుతున్నారు. అయితే కృష్ణాపురం అనేగ్రామం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండడంతో ఏ రాష్ట్రంలో నిత్య పాఠాలు చెప్పిందీ తెలియరాలేదు.

Tags

Read MoreRead Less
Next Story