'ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా': తేజ సజ్జ ట్వీట్ వైరల్

ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా: తేజ సజ్జ ట్వీట్ వైరల్
సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ.. అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు చాలా స్పెషల్..

సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ.. అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు చాలా స్పెషల్.. పెద్ద హీరోలు తమ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని తహ తహ లాడుతారు. నెల రోజుల ముందు నుంచే ఆయి సినిమాలకు సంబంధించిన సందడి మొదలవుతుంది. ఇక ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పెద్ద సినిమా ఏదంటే గుంటూరు కారం.

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో తప్పకుండా చెప్పుకోవలసిన మరో చిత్రం హను-మాన్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న తేజ సజ్జ చిత్రం. యంగ్ హీరో అయినా మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ గా ఇప్పటికే నిరూపించుకున్నాడు.

మొదటి సినిమా జాంబి రెడ్డితోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఇష్క్, అద్భుతం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సమంత నటించిన బేబీ సినిమాలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరో యాక్షన్ డ్రామా హనుమాన్ తో వస్తున్నాడు. అది కూడా సంక్రాంతి సమయంలోనే కాదు, మహేష్ బాబు సినిమా గుంటూరు కారం విడుదలయ్యే రోజే విడుదలవుతోంది.

దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు మరికొందరు తేజ సజ్జను ట్రోల్ చేస్తున్నారు. ఆయనతో నీకు పోటీ అవసరమా అని. దానికి తేజ కూడా సూపర్ గా రియాక్ట్ అయ్యాడు. సూపర్ స్టార్ తో పోటీ ఏంటి సర్.. ఆయనతో పోటీగా కాదు సర్.. ఆయనతో పాటుగా అని X లో పోస్ట్ చేశాడు.

దీంతో పాటుగా తాను మహేష్ బాబుతో కలిసిన నటించిన చిత్రానికి సంబంధించిన క్లిప్ ను పోస్ట్ చేశాడు. 2000 సంవత్సరంలో యువరాజు చిత్రంలో మహేష్ బాబు కొడుకుగా తేజ సజ్జ నటించాడు. ఈ చిత్రంలో సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లు. సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయినా మహేష్, తేజ్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఏకంగా ఆయనతోనే పోటీ పడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇప్పటికే విడుదలైన హనుమాన్ టీజర్ సినిమా ప్రియులను ఆకట్టుకుంది. చిన్న సినిమా చిన్న హీరో, పెద్ద సినిమా పెద్ద హీరో అని కాకుండా కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేనట్లు ప్రేక్షక దేవుళ్లే నిర్ణయిస్తారు ఏ సినిమాను హిట్ చేయాలో అనేది. అంతవరకు వెయిట్ చెయ్యాలి. మహేష్ సూపర్ స్టార్ కొడుకుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తే, తేజ ఏ బ్యాగ్రౌండ్ లేకుండానే తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story