సినిమా

RRR Naatu Pata: 'నాటు' పాటకు ఎవరైనా స్టెప్పెయ్యాల్సిందే.. అదరగొట్టిన బామ్మ..

RRR Naatu Pata: ఇద్దరు హీరోల స్టెప్పులు చూసి మైండ్ బ్లోయింగ్ అంటున్నారు ఫ్యాన్స్.

RRR Naatu Pata: నాటు పాటకు ఎవరైనా స్టెప్పెయ్యాల్సిందే.. అదరగొట్టిన బామ్మ..
X

RRR Naatu Pata: రాజమౌళి ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన నాటు పాటకు అద్దిరిపోయేలా డ్యాన్స్ చేసారు తారక్, చరణ్.. పాటని సోషల్ మీడియాలో విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. ఇద్దరు హీరోల స్టెప్పులు చూసి మైండ్ బ్లోయింగ్ అంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ డ్యాన్స్ స్టెప్పులు అందరికీ ఎంతగా నచ్చాయంటే అడుగులు తడబడుతున్నాయి.. మేం కూడా అదరగొట్టేస్తాం అంటూ ట్రై చేస్తున్నారు అందరూ.. తాజాగా పళ్లూడిపోయిన ఓ బామ్మ గారికి కూడా వీడియో చూసి ఊపొచ్చినట్టుంది. తాను కూడా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

ఒరిజనల్ పాట మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంటూ ఎంత క్రేజ్ అయిందో దానికి ఏ మాత్రం తీసిపోకుండా పలువురు నెటిజన్లు ఆ నాటు పాట స్టెప్పులను వేస్తూ వైరల్ అవుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియా అంతా నాటు పాట మేనియాలో ఊగిపోతోంది. బామ్మగారి డ్యాన్స్ చూస్తే మరికొంత మందికి ఊపొస్తుందేమో.. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Next Story

RELATED STORIES