Ori devuda: వెంకటేష్ స్థాయిని దిగజార్చిన చిత్రం: పరుచూరి కామెంట్

Ori devuda: వెంకటేష్ స్థాయిని దిగజార్చిన చిత్రం: పరుచూరి కామెంట్
Ori devuda: తీసిన అన్ని సినిమాలు హిట్ అవ్వవు. అన్ని కధలు ప్రేక్షకులకు నచ్చాలని లేదు. కోట్లాది మంది ప్రేక్షకుల నాడిని పట్టుకోవడం దర్శక నిర్మాతలకు కత్తి మీద సాము లాంటిదే.

Ori devuda: తీసిన అన్ని సినిమాలు హిట్ అవ్వవు. అన్ని కధలు ప్రేక్షకులకు నచ్చాలని లేదు. కోట్లాది మంది ప్రేక్షకుల నాడిని పట్టుకోవడం దర్శక నిర్మాతలకు కత్తి మీద సాము లాంటిదే. కోట్లు పెట్టిన తీసిన సినిమా అయినా చిన్న పొరపాటు జరిగితే ఆ సినిమా అట్టర్ ప్లాపైన సందర్భాలు ఉన్నాయి. ఆ పొరపాట్లనే పట్టుకుంటారు పరుచూరి. మాటల రచయితగా పేరు సంపాదించిన పరుచూరి గోపాల కృష్ణ ప్రస్తుతం పరుచూరి పలుకుల ద్వారా వస్తున్న సినిమాలపై విశ్లేషణ చేస్తుంటారు.



ఎన్నో ఆశలు పెట్టుకుని, పెద్ద హీరోలను పెట్లి తీసిని సినిమాలు ఎందుకు ప్లాపయ్యాయో వివరిస్తుంటారు. హిట్ అయిన్ చిత్రాలని కూడా తన పలుకుల్లో ప్రస్తావిస్తారు. ఈ మధ్య వెంకటేష్, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓరి దేవుడా గురించి ఆయన కామెంట్ చేశారు. తమిళంలో విజయవంతమైన ఓ మై కడవులే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన చిత్రం. కానీ ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.


ఈ చిత్రం చిన్ననాటి స్నేహితుల మధ్య నడిచిన అద్భుతమైన ప్రేమకథ. వెంకటేష్ దేవుడా లేక దేవుడి ప్రతినిధా అనేది చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఒక ఇమేజ్‌ ఉన్న హీరోని తన స్థాయికంటే తక్కువ చూపిస్తే ప్రమాదమని.. ఇది వెంకటేష్ విషయంలో నిజమైందని అన్నారు. ఆయన కోసం సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైందని అన్నారు. కామెడీ చేయాలంటే రాజేంద్ర ప్రసాద్ లాంటి నటీనటులు ఉండనే ఉన్నారని అన్నారు.


ఇక ఈ చిత్రానికి టైటిల్ కూడా ఓరి దేవుడా కాకుండా మరేదైనా పెట్టి ఉంటే బాగుండేదన్నారు. హీరోయిన్ నటనను ప్రశంసించారు పరుచూరి. అద్భుతమైన ప్రేమకథగా ఆకాశం అంచులదాకా వెళ్లాల్సిన సినిమా. కానీ మధ్యలోనే ఆగిపోయిందేమో అని అన్నారు. ఏది ఏమైనా ఓ మంచి ప్రయత్నం చేశారని దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు పరుచూరి.

Tags

Read MoreRead Less
Next Story