కోరుకున్నది నిజమైంది.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన పరిణితి

కోరుకున్నది నిజమైంది.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన పరిణితి
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా తమ వివాహాన్ని ఇన్‌స్టా-అఫీషియల్‌గా చేసుకున్నారు

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా తమ వివాహాన్ని ఇన్‌స్టా-అఫీషియల్‌గా చేసుకున్నారు. పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారు తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ హృదయపూర్వక నోట్‌ ఒకటి దానికి జోడించారు. ఉదయపూర్‌లో జరిగిన డ్రీమ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

చాలా కాలంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాము. చివరకు భార్యాభర్తలం అయ్యాము మీ అందరి ఆశీర్వాదంతో. ఒకరు లేకుండా ఒకరం జీవించలేము అని ఫోటోలతో పాటు పోస్ట్ చేశారు. మే 13న న్యూఢిల్లీలో వీరి నిశ్చితార్థం జరిగింది. అత్యంత అద్భుతమైన వ్యక్తి, అతని వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. “మా ఎంగేజ్‌మెంట్ పార్టీ ఒక కలలా ఉంది - ప్రేమ, నవ్వు, భావోద్వేగం, నృత్యాలు అది అంతా ఒక అందమైన కలలా సాగిపోయింది.

మనకు అత్యంత ప్రియమైన వారిని కౌగిలించుకుని, వారితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు అంతరాళాల్లో కూడుకట్టుకున్న భావోద్వేగాలు పొంగిపొర్లుతాయి. నా అద్భుత కథ ఎలా మొదలవుతుందో ఊహించాను. ఇప్పుడు అది నిజమైంది. ఇది నేను ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉంది అని రాఘవ చద్దాతో తన జీవితాన్ని పంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది పరిణితీ చోప్రా.

Tags

Read MoreRead Less
Next Story