Major: పరుచూరి మాటల్లో 'మేజర్'.. ఆ విషయంలో హ్యాట్సాఫ్..

Major: పరుచూరి మాటల్లో మేజర్.. ఆ విషయంలో హ్యాట్సాఫ్..
Major: పరుచూరి పాఠాల్లో మేజర్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆర్మీ నేపథ్యంతో సాగే ఏ కథనైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. సున్నిత అంశాలను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలి.

Major: సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్.. ఆర్మీ నేపధ్యంలో సాగిన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు శశికిరణ్ తిక్కా.. అడవి శేష్‌ ఉన్నికృష్ణన్‌గా జీవించి పాత్రకు ప్రాణం పోశారు. అందుకే ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని పవర్‌ఫుల్ డైలాగ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

పరుచూరి పాఠాల్లో మేజర్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆర్మీ నేపథ్యంతో సాగే ఏ కథనైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. సున్నిత అంశాలను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలి.. లేదంటే ప్రేక్షకుల చేతిలో చీవాట్లు తప్పవు.. అయితే ఆ విషయంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. సందర్భానుసారంగా వచ్చిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇచ్చాయి.

ముఖ్యంగా నా ప్రాణాన్ని తీసుకోగలవు కానీ నా దేశాన్ని తీసుకోలేవు అని సైనికుడి ప్రమాణాన్ని తెరపై అద్భుతంగా చూపించారు. ఆ విషయంలో దర్శకుడు శశికిరణ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని పరుచూరి అన్నారు. హీరో తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతిల నటనను ఆయన ప్రశంసించారు. సంభాషణలు రాసిన అబ్బూరి రవి కృతకృత్యడయ్యాడన్నారు.

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మేజర్ సాక్ష్యం అని అన్నారు. ఈ సందర్భగా 2008లో ఉగ్రదాడి జరిగినప్పుడు తాము గోవాలో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ముంబయి ఉగ్రదాడి ప్రభావం గోవాలో కూడా ఉంటుందేమోనని భయపడ్డామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story