Paruchuri Palukulu: కాంతారా.. ఇట్స్ మై బ్యాడ్ లక్: పరుచూరి

Paruchuri Palukulu: కాంతారా.. ఇట్స్ మై బ్యాడ్ లక్: పరుచూరి
Paruchuri Palukulu: 'కాంతారా' ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం. చిన్న సినిమా పెద్ద రికార్డులు సృష్టించింది. ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Paruchuri Palukulu: 'కాంతారా' ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం. చిన్న సినిమా పెద్ద రికార్డులు సృష్టించింది. ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాంతార నటుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టిని ఇండస్ట్రీ ఆకాశానికి ఎత్తేస్తుంది. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కన్నడ సంస్కృతి సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో ఎలాంటి లోపాలు లేవని, చిత్రం అత్యద్భుతంగా ఉందని అన్నారు. ఈ మేరకు పరుచూరి పలుకులు వేదికగా కాంతారాపై రివ్యూ చెబుతూ వీడియో షేర్ చేశారు. ఇలాంటి అత్భుతమైన చిత్రాన్ని తాను థియేటర్‌లో చూడలేకపోయానని అది తన బ్యాడ్‌లక్ అని అన్నారు.


ఇదేదో ఆత్మలకు సంబంధించిన సినిమా అనుకున్నా. ఇదొక అభ్యదయ చిత్రం. మన తెలుగులో వచ్చిన మా భూమి లాంటి చిత్రమిది. ఆ సినిమాలో ప్రజలు పోరాడారు. ఈ సినిమాలో ఓ భూతకోల కళాకారుడు పోరాటం చేశాడు.


ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో విషయాలను మెచ్చుకోవాలి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే. రిషబ్ శెట్టి కథ, కథనం అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమా ప్రథమార్థం చూసినప్పుడు జమీందారే విలన్ అని ఎవరూ అనుకోరు. అటవీ అధికారే ప్రతినాయకుడు అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది.



అడవి మీద కన్ను వేసింది జమీందారు అని చూపించి సెకండాఫ్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. జమీందార్ పాత్ర ధారిగా అచ్చుత్ కుమార్ నటన అదిరిపోయింది. సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా తల్లి పాత్ర పోషించిన నటిని సినిమా నటి అంటే ఎవరూ నమ్మరు.



అడవిలో ఉండే అమ్మాయి ఈ పాత్ర పోషించిందేమో అనే భావన కలుగుతుంది. అంత అద్భుతంగా, అంత సహజంగా ఉంది ఆమె నటన. ఆమె సినిమాలో లీనమై నటించింది. క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంది. అందుకే ప్రేక్షకులు కాంతారా చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

Tags

Read MoreRead Less
Next Story