సినిమా

Radhe Shyam Release postponed : డార్లింగ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్... 'రాధేశ్యామ్' వాయిదా?

Radhe Shyam Release postponed : ఒకపక్కా కరోనా, మరోపక్కా ఒమిక్రాన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

Radhe Shyam Release postponed : డార్లింగ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్...  రాధేశ్యామ్ వాయిదా?
X

Radhe Shyam Release postponed : ఒకపక్కా కరోనా, మరోపక్కా ఒమిక్రాన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ధియేటర్ లలో యాభై శాతం సిట్టింగ్ లకి మాత్రమే అనుమతి ఇచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ అమలవుతుంది. ఈ క్రమంలో పాన్ ఇండియా మూవీలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే RRR సినిమాని వాయిదా వేశారు.

ఇప్పుడు అదే బాటలో ప్రభాస్ హీరోగా వస్తోన్న 'రాధేశ్యామ్‌' సినిమా కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు మేకర్స్... కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా విడుదలని వాయిదా వేసి మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది.

వాయిదా పడుతుందని చెప్పడానికి మరో కారణం లేకపోలేదు.. సినిమా రిలీజ్‌‌కి దగ్గరపడుతున్న కొద్ది ఇప్పటివరకు రాధేశ్యామ్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది లేదు.. ప్రభాస్‌‌తో పాటుగా చిత్ర యూనిట్ ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది లేదు. దీంతో ఈ సినిమా కూడా వాయిదా పడడం పక్కా అని సోషల్ మీడియా లో టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటించింది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Next Story

RELATED STORIES