Baahubali: ప్రభాస్ మైనపు విగ్రహానికి మా అనుమతి తీసుకోలే : శోభు యార్లగడ్డ

Baahubali: ప్రభాస్ మైనపు విగ్రహానికి మా అనుమతి తీసుకోలే : శోభు యార్లగడ్డ
మైసూరు మ్యూజియంలో ప్రభాస్ స్టాచ్యూ.. ఫైర్ అయిన బాహుబలి నిర్మాత

అభిమానులు రెబల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభాస్, SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సిరీస్‌లో మహేంద్ర, అమరేంద్ర బాహుబలి అనే ఐకానిక్ క్యారెక్టర్స్ ను పోషించాడు. అతని ప్రదర్శన అతనికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయం సాధించిన సంవత్సరాల తర్వాత, హైదరాబాద్‌లోని ఒక మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన 'బాహుబలి' నిర్మాత శోబు యార్లగడ్డ... తమ అనుమతి లేకుండా విగ్రహాన్ని స్థాపించారని ఎక్స్ లో పేర్కొన్నారు.


'బాహుబలి' వరకు ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రగామిగా నిలిచాడు. 'బాహుబలి' తర్వాత, ఆయన పాన్-ఇండియన్ స్టార్ అయ్యాడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇటీవల, X లో ప్రభాస్ ఫ్యాన్ పేజీ, మైసూర్‌లోని ఒక మ్యూజియంలో ఉన్న ఆయన మైనపు విగ్రహాన్ని పంచుకుంది. అయితే అది 'బాహుబలి' నిర్మాత శోబు యార్లగడ్డకు మింగుడు పడలేదు. ఇది లైసెన్స్ పొందిన పని కాదని, ఇన్‌స్టాలేషన్‌కు ముందు ఎటువంటి అనుమతి తీసుకోలేదని ఆయన వెల్లడించారు. "ఇది అధికారికంగా లైసెన్స్ పొందిన పని కాదు. మా అనుమతి లేదా తెలియకుండా జరిగింది. దీన్ని తొలగించడానికి మేము వెంటనే చర్యలు తీసుకుంటాము" అని తెలిపారు.


'బాహుబలి' గురించి

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' రెండు భాగాల్లో రూపొందిన పీరియాడికల్ డ్రామా. ఈ కల్పిత కథను రాజమౌళి తండ్రి, ప్రముఖ స్క్రీన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాశారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ రెండు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2,500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. భారతదేశంలోనే కాదు, జపాన్‌లో కూడా ఈ సినిమా ఏడాది పాటు సక్సెస్ ఫుల్ గా ఆడింది.

Tags

Read MoreRead Less
Next Story